|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ఆగస్ట్ 29 ఎపిసోడ్: రాజ్‌కు గుర్తుకు వచ్చిన గతం- పిచ్చిదైపోయిన యామిని- సొంతింటికి అసలైన రాజ్‌గా ఎంట్రీ

Published: 28-08-2025, 10:17 PM
బ్రహ్మముడి ఆగస్ట్ 29 ఎపిసోడ్: రాజ్‌కు గుర్తుకు వచ్చిన గతం- పిచ్చిదైపోయిన యామిని- సొంతింటికి అసలైన రాజ్‌గా ఎంట్రీ

బ్రహ్మముడి సీరియల్‌లోని ఆగస్ట్ 29 ఎపిసోడ్ రాజ్ ఆసుపత్రిలో ఉన్నాడు. అపర్ణ బాధపడుతుండగా, యామిని రాజ్ గురించి తన స్వంత వైఖరిని చూపిస్తుంది. కావ్య మరియు ఇతర పాత్రలు ఈ సంఘటనలకు ఎలా స్పందిస్తాయో చూడండి.

రాజ్‌కు గుర్తుకు వచ్చిన గతం

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ హాస్పిటల్‌లో ఉంటాడు. అపర్ణ చాలా బాధపడుతుంది. వాడు చావు అంచులో ఉండటానికి తనే కారణం అని, క్షమించమని ప్రాధేయపడుతుంది అపర్ణ. ఇంతలో యామిని వచ్చి చప్పట్లు కొడుతుంది. మీది ఎవరిది తప్పు లేదంటా చేతులు దులుపేసుకుందామనుకుందామనుకుంటున్నారా అంటుంది.

నిజానికి నేను చేసిన సాయానికి నా కాళ్లు కడిగి మీ నెత్తిన పోసుకోవాలి. రాజ్ గతం మర్చిపోయి ఉంటే నేను అండగా నిలిచాను. మీరంతా ప్లాన్స్ వేసుకుని మరి రాజ్‌కు గతం గుర్తుకు తేవాలని ప్రయత్నించి ఇక్కడికి తీసుకొచ్చారు. రాజ్‌కు ఏమైనా జరగాలు మీ ఒక్కొక్కరి సంగతి చెబుతా అని యామిని అంటే కావ్య వెళ్లి ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది.

నన్నే కొడతావా అని యామిని చేయి లేపితే ఆపి ఇంకా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నీ బతుకు ఇక్కడ అందిరికి తెలుసు. సిగ్గులేని నువ్వు నాకు నీతులు చెబుతున్నావా. దీనంతటికి కారణం ఎవరు నువ్వు కాదా. నా కడుపులో తండ్రి ఎవరో కనుక్కోమ్మని చెప్పింది ఎవరు నువ్వు కాదా. రెచ్చగొట్టింది నువ్వు కాదా అని రివర్స్‌లో యామినిపై ఫైర్ అవుతుంది కావ్య.

ఇంకా ఒక్క క్షణం ఇక్కడ ఉండే చంపేస్తా వెళ్లు అని కావ్య అంటుంది. ఇంతలో రుద్రాణి వచ్చి కావ్యను ఆపి తనకు పరిస్థితి అర్థమయ్యేలా చెబుతానను యామినిని బయటకు తీసుకెళ్తుంది. నేను ఊరుకోను అని ఇంకా రెచ్చిపోతుంది యామిని. ఏం చేస్తావ్. ఏం చేయలేవు. కావ్య ఒక్కతే కొట్టింది కాబట్టి సరిపోయింది. వాళ్లంతా కోప్పడి కొడితే రాజ్ పక్కన ఇంకో బెడ్ వేసుకోవాలి అని రుద్రాణి అంటుంది.

యామిని యొక్క పిచ్చి ప్రవర్తన

రాజ్ మీద నాకు హక్కు లేదా అని యామిని అంటే.. అసలు ఏముంది, ప్రేమించావ్ అని తప్ప నీకు ఏ హక్కు లేదు. కావ్యకే సర్వహక్కులు ఉన్నాయి. రాజ్ కూడా నిన్ను ప్రేమించట్లేదు. టైమ్ మనది కానప్పుడు సైలెంట్‌గా ఉండాలి. నీ అవకాశం వచ్చేవరకు ఎదురుచూడు. అప్పుడు ఏం చేయాలో నేను చెబుతాను అని రుద్రాణి సలహా ఇస్తుంది.

మరోవైపు కావ్య బాధపడుతుంటే ఇందిరాదేవి ఓదార్చుతుంది. నీ మనసులోనే దేవుడు ఉన్నాడు. ప్రార్థించు. కచ్చితంగా నీకు సహాయం చేస్తాడు అని చెబుతుంది ఇందిరాదేవి. దాంతో వినాయకుడి దగ్గరికి వెళ్లి కావ్య మొరపెట్టుకుంటుంది. మాకు బంధాన్ని వేసిన నువ్వే కాపాడే సమయం వచ్చింది. కడదాకా కాపాడుతావో కడలిలో ముంచుతావో నీ ఇష్టం అని దండం పెట్టుకుంటుంది కావ్య.

ఇంతలో డాక్టర్ వచ్చి రాజ్ స్పృహలోకి వచ్చాడని, కండిషన్ బాగుందని, ఏం సమస్య లేదని చెబుతాడు. కాకపోతే బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. మళ్లీ స్పృహ తప్పితే ప్రమాదం అని డాక్టర్ సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. అపర్ణ అందరు రాజ్‌ దగ్గరికి వెళ్తారు. రాజ్ కళ్లు తెరుస్తాడు. రుద్రాణి, రాహుల్ నిరాశపడతారు. కావ్య కోసం రాజ్ చూస్తాడు.

కళావతికి ఎలా ఉంది ఇప్పుడు. తనకు బాగుంది కదా అని రాజ్ అడుగుతాడు. ఆ మాటలు యామిని వింటుంది. అదేంట్రా అలా అడుగుతున్నావ్ అని అపర్ణ అంటే.. అదేంటీ మమ్మీ మేమిద్దరం కారులో వెళ్తుంటే కదా యాక్సిడెంట్ జరిగింది. నేను హాస్పిటల్‌లో ఉన్నానంటే తనెక్కడ ఉంది. ఏమైంది అని రాజ్ అంటాడు. కారు ఏంట్రా అని అపర్ణ అంటుంది.

సొంతింటికి రాజ్ యొక్క ఎంట్రీ

దాంతో డాక్టర్‌ను ఇంట్లోవాళ్లు పిలుస్తారు. ఇంతలో కావ్యను అప్పు వెళ్లి పిలుచుకువస్తుంది. శ్రీశైలం వెళ్లే దారిలో మాకు యాక్సిడెంట్ అయింది. తనకేదో జరిగింది. వీళ్లంతా అబద్ధం చెబుతున్నారు అని అరుస్తాడు రాజ్. డాక్టర్ రాజ్‌కు మత్తు ఇంజక్షన్ ఇస్తాడు. ఇంతలో కావ్య వచ్చి నేను బాగానే ఉన్నానండి. మీరు కంగారుపడకండి అని కావ్య చెబుతుంది.

ఎప్పుడో జరిగిన శ్రీశైలం యాక్సిడెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడేంటీ అని డాక్టర్‌ను ఇంట్లోవాళ్లు అడుగుతారు. మరోవైపు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతుంది యామిని. తను అనుకున్నదంతా ఫెయిల్ అయిపోయిందని, రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందని పిచ్చిదానిలా చేస్తుంది యామిని.

మరోవైపు సొంతింటికి అసలైన రాజ్‌గా రాజ్ వస్తాడు. కావ్య దగ్గరికి రాజ్ వెళ్తే ప్రేమగా హత్తుకుంటుంది కళావతి . ఆ కావ్యను తప్పించి నా బావను సొంతం చేసుకుంటాను అని యామిని మరోవైపు అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, రాజ్ స్పృహలోకి వచ్చినా, యామిని యొక్క కుట్రలు మరియు కావ్య, ఇతరుల ప్రతిస్పందనలు కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. రాజ్ యొక్క గతం గుర్తుకు రావడం ఇంకా ఎదురుచూడాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.