|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి జూలై 7 ఎపిసోడ్: యామినికి నిజం చెప్పిన రాజ్- సిద్ధార్థ్‌ను వణికించిన రామ్- సంతోషంలో కావ్య- ఇంటి పనోడిగా రాహుల్

Published: 06-07-2025, 10:40 PM
బ్రహ్మముడి జూలై 7 ఎపిసోడ్: యామినికి నిజం చెప్పిన రాజ్- సిద్ధార్థ్‌ను వణికించిన రామ్- సంతోషంలో కావ్య- ఇంటి పనోడిగా రాహుల్

బ్రహ్మముడి సీరియల్‌లోని జూలై 7వ తేదీ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన ట్విస్టులు కనిపించాయి. రాజ్ ఆఫీసులో ప్రాంక్ చేయగా, కావ్య అతనిని కాపాడింది. ఇంట్లో రాహుల్‌కు గట్టి పరిస్థితి ఎదురైంది.

Key Points

1

రాజ్ ఆఫీసులో చేసిన ప్రాంక్‌తో ఉద్యోగులంతా భయపడ్డారు.

2

కావ్య రాజ్ ప్రాంక్‌ను కవర్ చేసి అందరినీ పంపించింది.

4

రాహుల్ ప్రేమకథ, నగల దొంగతనం వెలుగులోకి వచ్చాయి.

రాజ్ యొక్క ఆఫీసు ప్రాంక్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆఫీస్‌లో రాజ్ మాటలకు స్టాఫ్ అంతా భయపడుతున్నట్లు చెబుతారు. శ్రుతిని పిలిచి కొట్టబోతే భయంతో చెంపలు మూసుకుంటుంది. భయం అంటే ఇలా ఉండాలి అని రాజ్ అంటాడు. గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా భయపడుతున్న అని ఎంప్లాయ్ అంటాడు. దాంతో అతని గుండెలపై తల పెట్టి హార్ట్ బీట్ వింటాడు రాజ్ .

ఇలా ఆఫీస్‌లో విచిత్రంగా, వింతగా ప్రవరిస్తాడు రాజ్. శ్రుతి వీళ్లకు నేనంటే భయం లేకుండా పోయింది. వీళ్లందరిని వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. మీరందరు ఫైర్ అని రాజ్ అంటాడు. ఇంతలో వచ్చిన కావ్య వచ్చి చప్పట్లు కొట్టి సూపర్ సర్ మీరు అని అంటూనే ఉంటుంది. మీరేం కంగారుపడకండి. ఇదంతా రాజ్ సర్ చేసిన ప్రాంక్ అని కవర్ చేసి అందరిని పంపించేస్తుంది కావ్య.

అసలు మీరేం చేస్తున్నారు. ముందు ఇంటికి పదండి అని రాజ్‌ను తీసుకెళ్తుంది కావ్య. నాకు చెప్పకుండా ఆఫీస్‌కు ఎందుకు వెళ్లారు అని కావ్య అడిగితే మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని రాజ్ అంటాడు. ఇంప్రెస్ కాదు నన్ను ఇరికించడానికి వెళ్లినట్లుందని కావ్య అంటుంది. మీరు నిజమైన బాస్ కాదు అని సిద్ధార్థ్‌కు ఒక్క క్లూ వెళ్లిన మన ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యేది అని కావ్య అంటుంది.

మరోవైపు రుద్రాణి కాళ్లపై పడేలా రాహుల్‌ను ఈడ్చిపడేస్తుంది స్వప్న. రాహుల్ మళ్లీ ఏం చేశావ్ అని అపర్ణ అంటుంది. ఇంట్లో తేరగా దొరికేది మేమేగా అని రుద్రాణి అంటుంది. నీ కొడుకు ఏం చేశాడో చెబితే ఇంట్లోవాళ్లంతా చెప్పుతో కొడతారు. ఆరోజు నగలు దొంగలిస్తున్నాడని చెప్పాగా. వాటిని తీసుకెళ్లి ఈయన ఉంచుకున్నదానికి ఇచ్చాడు అని స్వప్న అంటుంది.

కావ్య యొక్క సమర్థన

ఆరోజు మీకు చూపించిన నగలు గిల్టు నగలు. కట్టుకున్న భార్యను మోసం చేసిన గిల్టు నగలు పెట్టి ఈ నగలను తన గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు అని స్వప్న అంటుంది. నువ్ చెప్పేది నిజమని ఎలా నమ్మడం అని రుద్రాణి అంటే.. దీన్ని చూస్తే నమ్ముతారా అని రాహుల్ లవర్‌ను తీసుకొచ్చి చూపిస్తుంది అప్పు. జరిగింది మొత్తం చెప్పు అని అప్పు అంటే గర్ల్‌ఫ్రెండ్ చెబుతుంది.

నేనేం అడగలేదు. నా మీద ప్రేమ ఉందని, పెళ్లి చేసుకుంటానని ఏడు వారాల నగలు తీసుకొచ్చి ఇచ్చాడు అని ఆమె చెబుతుంది. తర్వాత తాతయ్య నాకు రాసిచ్చిన ఆస్తి పేపర్స్ కూడా ఇద్దామని చూశాడని స్వప్న చెబుతుంది. దాంతో ఇంట్లోవాళ్లంతా చివాట్లు పెడతారు. రాహుల్ లవర్‌ను పంపించేస్తారు. వాన్ని అదుపులో పెట్టుకోవడం మానేసి నన్ను అంటున్నావా అని స్వప్ననే నిందిస్తుంది రుద్రాణి .

చాల్లే నోర్మూయ్. రాహుల్‌కు ఇక నుంచి పాకెట్ మనీ ఇవ్వడానికి వీళ్లేదు. కంపెనీ నుంచి కూడా ఇచ్చే నెల డబ్బులను క్యాన్సిల్ చేస్తున్నాను. డబ్బులు ఖర్చు చేయకుండా ఉండటమే కాదు ఇంట్లో పనులు కూడా చేయాలి. నాకు తెలియకుండా వాడికి ఎవరైన డబ్బులు ఇచ్చారని తెలిస్తే వాళ్లకు కూడా ఇదే గతి పడుతుంది. రుద్రాణి ముఖ్యంగా నీకు అని ఇందిరాదేవి ఆర్డర్ పాస్ చేస్తుంది.

ఎంత తిట్టిన పట్టించుకోకుండా ఉన్న నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అని రాహుల్‌ను ఆటపట్టిస్తాడు రాజ్. తర్వాత ఈరోజు రాత్రంతా మీకు ట్రైనింగ్. ఎక్కడికి వెళ్లట్లేదు. మీటింగ్ సక్సెస్ అయ్యేవరకు అంతే అని కావ్య అంటుంది. మరోవైపు రాహుల్‌ను చెంపదెబ్బ కొట్టి ఇంకా మారవా. రోజు రోజుకు దిగజారుతున్నావ్. ఇక చేయడానికి ఏం లేదు. ఇంట్లో పనులు చేస్తూ చిల్లర ఖర్చులు తీసుకో అని రుద్రాణి మండిపడి వెళ్లిపోతుంది.

రాహుల్‌కు ఇంట్లో ఇబ్బందులు

యామినికి కాల్ చేసి కావ్య ఇంట్లో ఉన్నట్లు, రాత్రికి ఇంటికి రావట్లేదు, రాత్రంతా కళావతితో స్పెండ్ చేస్తున్నా అని రాజ్ చెబుతాడు. దాంతో యామిని షాక్ అవుతుంది. కళావతి ఆఫీస్‌లో సమస్య అట, తన ఎండీ ప్లేసులో నటించడానికి వెళ్తున్నట్లు అని రాజ్ చెబుతాడు. కావ్య అన్న మాటలు తలుచుకుని తనలో తానే మెలికలు తిరిగిపోతాడు. అది చూసిన ఇందిరాదేవి, అపర్ణ ఏమైందని అడుగుతారు.

ఈ రాత్రంతా కళావతి గారు నన్ను తన పక్కనే ఉంచుకోబోతున్నారు అని సిగ్గు పడతాడు రాజ్. అంత టైమ్‌లో నా ప్రేమ గురించి చెప్పొచ్చుగా. ఏదైనా జరగొచ్చుగా అని సిగ్గు పడుతూ వెళ్లిపోతాడు. పాపం వీడిని కావ్య రాత్రంతా పిండేస్తుందని తెలిస్తే ఏమైపోతాడో అని అపర్ణ అంటుంది. రాజ్ తను ఐ లవ్యూ అని చెప్పి ఎండ్ కార్డ్ వేస్తానని కావ్య గదిలోకి వెళ్తాడు.

మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌లో బోర్డ్ మీటింగ్‌లో రాజ్ ఉన్న కండిషన్‌కు కంపెనీ హ్యాండిల్ చేయలేడని, ఎండీని మార్చాలనుకుంటున్నట్లు, గతంలో జరిగిన డీల్స్ గురించి ఏమైనా తెలుసా అని సిద్ధార్థ్ అంటాడు. మీ నాన్న బోర్డ్ మెంబర్‌గా ఉన్నప్పుడు జింబాబ్వే నుంచి ఇల్లీగల్‌గా గోల్డ్ తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టడానికి ట్రై చేశారు. ఇప్పటివరకు అది నాకు, మీ నాన్నకు, నీకు, మా తాతయ్యకు నలుగురికి మాత్రమే తెలుసు అని రాజ్ అంటాడు.

రాజ్‌గా ఉన్న రామ్ మాటలకు సిద్ధార్థ్ వణికిపోతాడు. అదంతా విన్న కావ్య ఈ విషయాలు ఈయనకెలా తెలుసు. కొంపదీసి ఈయనకు గతం గుర్తుకువచ్చిందా అని కావ్య అనుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరికి రాహుల్‌కు ఇంట్లో తీవ్రమైన చివాట్లు పడ్డాయి. అతని ప్రేమకథ మరియు దొంగతనం వలన కుటుంబం మొత్తం తీవ్ర సంక్షోభంలో పడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.