
స్టార్ మా ఛానెల్ బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా ప్రేక్షకులను మెప్పించిన దీపిక రంగరాజు, తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ, రష్మిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె జీవితం, కెరీర్ గురించి ఆమె పంచుకున్న విషయాలు ఆకట్టుకుంటున్నాయి.
Key Points
బ్రహ్మముడి కావ్య దీపిక రంగరాజు తన టాక్ షో ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో కిస్సింగ్ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రష్మిక కంటే తాను విజయ్ దేవరకొండతో బాగా కిస్ చేస్తుందని దీపిక తెలిపింది.
దీపిక తన ఆర్థిక స్థితి గురించి, ఇంటి కల గురించి హృద్యంగా మాట్లాడింది.
కార్తీక దీపం సీరియల్ ఆఫర్‌ను తిరస్కరించిన విషయాన్ని దీపిక వెల్లడించింది.
దీపిక రంగరాజు షాకింగ్ కామెంట్స్
స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. బ్రహ్మముడి లో కావ్యగా, కళావతిగా అద్భుతమైన నటనతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది దీపిక రంగరాజు. బుల్లితెర షోలలో నిత్యం నవ్వుతూ పంచులు, ప్రాసలతో అందరిని నవ్వించే దీపిక రంగరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పింది.
జబర్దస్త్ బ్యూటి వర్ష హోస్ట్‌గా చేస్తున్న షో కిసిక్ టాక్స్. తాజాగా కిసిక్ టాక్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా దీపిక రంగరాజు అలియాస్ బ్రహ్మముడి కావ్య హాజరు అయింది. ఈ టాక్ షోకి రావడంతో వర్షపై పంచులు వేసి నవ్వించింది దీపిక.
విజయ్ దేవరకొండ, రష్మికపై వ్యాఖ్యలు
నవరసాలు చేసి చూపించిన దీపిక రంగరాజు. “ఆన్‌స్క్రీన్‌లో రొమాంటిక్ సీన్ వస్తే ఏ హీరోతో చేస్తావు” అని వర్ష అడిగితే.. “ఏ హీరో అయిన ఓకే. వాళ్లే సిగ్గుపడతారు. అందులో నాకు ఎలాంటి మొహమాటం లేదు” అని దీపిక రంగరాజు తెలిపింది.
” విజయ్ దేవరకొండ గారితో కిస్సింగ్ సీన్ చేయాలంటే చేస్తావా” అని వర్ష అడిగింది. “రష్మిక గారు ఏంటీ నేను ఎంత బాగా చేస్తానో తెలుసా” అని విజయ్ దేవరకొండతో రష్మిక కంటే తానే బాగా కిస్ చేస్తాను అన్నట్లుగా చెప్పింది దీపిక రంగరాజు. దాంతో వర్ష పడి పడి నవ్వింది. “ఇంత బ్యూటిఫుల్ స్మైల్‌తో ఉంటావ్ మీ మదరు చాలా లక్కీ నిన్ను కన్నందుకు” అని వర్ష అంది.
దీపిక ఆర్థిక స్థితి, కార్తీక దీపం ఆఫర్
“తను చాలా బాధపడుతుంది. నాక ఒక డ్రీమ్ సొంత ఇల్లు కొనాలని” అని దీపిక చెబితే ఇన్ని షోలు చేశావ్ ఇల్లు లేదా అని వర్ష అడిగింది. “అంటే మనం ప్రపంచంలో పుట్టినప్పుడే ప్రభుత్వం మనకు ఇస్తుంది కదా. శ్మశానంలో ఉంటుంది కదా ఆరు ఫీట్ల గొయ్యి. మనం చనిపోతే పాతిపెట్టేందుకు ఒక ఆరడుగుల గొయ్యి ఉంటుంది కదా. అది తప్ప నాకు వేరే లేవు” అని దీపిక రంగరాజు ఏడిపించేసింది.
దీపిక మాటలకు వర్ష తెగ షాక్ అయింది. అలాగే, కార్తీక దీపం సీరియల్ ఆఫర్ మొదట దీపిక రంగరాజు వద్దకే వెళ్లినట్లు వర్ష చెప్పింది. “నాకు పేరు చెప్పలేదు. కానీ, మొహం నిండా బ్లాక్ మేకప్ వేసుకోవాలని చెప్పారు. అది ఇష్టం లేకే ఒప్పుకోలేదు” అన్నట్లుగా దీపిక రంగరాజు చెప్పింది.
దీపిక రంగరాజు యొక్క నిజాయితీ, హృదయపూర్వక మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆమె జీవితంలోని వివిధ అంశాలపై ఆమె వెల్లడించిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి.


