|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి అక్టోబర్ 2 ఎపిసోడ్: డాక్టర్ అత్తను దొంగలా కట్టేసిన రాజ్- నిజం చెప్పనివ్వకుండా- కావ్య దగ్గర నోరు జారిన కల్యాణ్

Published: 01-10-2025, 10:11 PM
బ్రహ్మముడి అక్టోబర్ 2 ఎపిసోడ్: డాక్టర్ అత్తను దొంగలా కట్టేసిన రాజ్- నిజం చెప్పనివ్వకుండా- కావ్య దగ్గర నోరు జారిన కల్యాణ్

బ్రహ్మముడి అక్టోబర్ 2 ఎపిసోడ్‌లో ఉత్కంఠ తీవ్రమైంది. కావ్య తన అబార్షన్ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించగా, రాజ్ దానిని ఆపేందుకు కొత్త పథకం వేస్తాడు. డాక్టర్ అత్తను దొంగలా కట్టేసి, ఆమె ద్వారా కావ్యకు నిజం చెప్పకుండా అడ్డుకుంటాడు. కల్యాణ్ కావ్య దగ్గర నోరు జారి, కీలక విషయాన్ని బయటపెట్టే అవకాశం ఉంది.

Key Points

1

కావ్య తన అబార్షన్ వెనుక నిజం తెలుసుకోవడానికి ఆసుపత్రికి వెళ్తుంది.

2

రాజ్, నర్స్ శాంతి సహాయంతో డాక్టర్ అత్తగారిని దొంగలా కట్టేసి నాటకం ఆడుతాడు.

4

అబార్షన్ విషయంపై డాక్టర్ స్పందన, కల్యాణ్ కావ్య దగ్గర నోరు జారే అవకాశం ఉంది.

రాజ్ ప్లాన్: డాక్టర్ అత్తను కట్టేసి

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో హాస్పిటల్‍కు కావ్య వెళ్తుంది. పేషంట్స్ ఉన్నారని, వాళ్ల తర్వాత వెళ్లాలని నర్స్ శాంతి అంటుంది. ఇంతలో శాంతికి డాక్టర్ కాల్ చేసి లోపలికి పిలుస్తుంది. కావ్య అనే పేషంట్ వచ్చిందా అని అడుగుతుంది. వచ్చారు. కానీ, వేరే పేషంట్స్ ఉన్నారు. కావ్య గారు వాష్ రూమ్‌కు వెళ్లారు అని నర్స్ శాంతి అబద్ధం చెబుతుంది.

సరే వేరే పేషంట్స్‌ను రమ్మను, కావ్య వచ్చాకా నాకు చెప్పు అని డాక్టర్ చెబుతుంది. సరే అని శాంతి కంగారుగా బయటకు వెళ్తుంది. కావ్యతో ఇంకా పేషంట్స్ ఉన్నారు. వెళ్లి ఏసీ రూమ్‌లో వెయిట్ చేయమని అంటంది శాంతి. నేను ఇక్కడే ఉంటాను. అయినా నా పేరు మీకెలా తెలుసు అని నర్స్‌ను అడుగుతుంది కావ్య. ఇందాక డాక్టర్ దగ్గర మీ అప్లికేషన్‌లో పేరు చూశాను అని కవర్ చేస్తుంది శాంతి.

తర్వాత రాజ్‌కు కాల్ చేసి మీ భార్య ప్రశ్నల ప్రశ్నల అడుగుతున్నారు. ఇంకా ఆపలేను. ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది శాంతి. పటాన్ చెరు అని రాజ్ అంటే.. అది మా డాక్టర్ అత్తగారు ఉండే ఏరియా. అక్కడి నుంచి ఇక్కడికి 40 నిమిషాలు పడుతుంది. అంతసేపు ఆపలేను అని నర్స్ చెబుతుంది. మీ డాక్టర్ అత్తగారి ఇంటి అడ్రస్ పంపు. నేను చూసుకుంటాను అని రాజ్ అంటే నర్స్ శాంతి పంపిస్తుంది.

నేను చెబితే డాక్టర్ వినలేదు. డాక్టర్ అత్తగారు చెబితే వినరా అని రాజ్ అనుకుంటాడు. డాక్టర్ అత్తింటికి రాజ్ వెళ్తాడు. ఆమె గయ్యాలి అత్తలా ఉంటుంది. మీరు పైకే డేరింగ్ అండ్ డ్యాషింగ్ అని, కోడలి మాట అంటే వణికిపోతారను అని కాలనీ వాళ్లు అంతా అనుకుంటున్నారు అని ఎక్కిస్తాడు రాజ్. దానికి ఏం చేయాలి అని డాక్టర్ అత్త అడుగుతుంది.

కావ్య నిజం తెలుసుకునే ప్రయత్నం

నేను మిమ్మల్ని కట్టేసి, వస్తువులన్నీ దొంగతనం చేసినట్లు మీ కోడలికి ఫోన్ చేసి చెప్పండి. మీరంటే భయంతో మీ కోడలు వస్తే అదంతా వీడియో రికార్డ్ చేస్తాను. అది మీ కాలనీవాళ్లకు చూపిస్తే మీరంటే ఏంటో తెలుస్తుంది అని రాజ్ చెబుతాడు. దాంతో తనను కట్టేయమని డాక్టర్ అత్త చెబుతుంది. మరోవైపు కావ్య గురించి డాక్టర్ అడగడంతో నర్స్ శాంతి పంపిస్తుంది.

లాస్ట్ టైమ్ మా ఆయన చేసినదానికి సారీ చెబుతున్నాను. ఏదోదో జరిగిపోయింది అని కావ్య అంటే.. భర్తగా ఆయన పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ, డాక్టర్‌గా నా బాధ్యత నిర్వర్తించాలిగా అని డాక్టర్ చెబుతుంది. అసలు ఆరోజు మావారు అబార్షన్ చేయించడానికి ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. అలా ఎందుకు చేశారో తెలుసుకుందామని చూశాను. కానీ, తెలియలేదు. మీరైనా చెప్పండి అని కావ్య అడుగుతుంది.

ఇంతలో డాక్టర్‌కు అత్త వీడియో కాల్ చేస్తుంది. వీడెవడే దొంగ ఎధవ దొంగతనానికి వచ్చాడు. నన్ను కట్టేశాడు అని డాక్టర్ అత్త నాటకం ఆడుతుంది. దాంతో మా అత్తగారు డేంజర్‌లో ఉన్నారు. త్వరగా వెళ్లాలి. మీతో తర్వాత మాట్లాడుతా అని డాక్టర్ అత్తింటికి వెళ్తుంది. డాక్టర్ వెళ్లేలోపు వాళ్ల అత్తను వీడియో తీస్తుంటాడు. అది చూసి ఏంటిది అంతా అని కోప్పడుతుంది డాక్టర్.

ఇదంతా నాటకం. నువ్వంటే నాకు భయమని కాలనీవాళ్లు అనుకుంటున్నారట. అది నిజం కాదని నిరూపించడానికే ఇదంతా అని డాక్టర్ అత్త చెబుతుంది. అయ్యో అత్తయ్య మిమ్మల్ని పిచ్చిదాన్ని చేసి తన అవసరానికి వాడుకున్నాడు అని డాక్టర్ చెబుతుంది. రాజ్ కూడా అవును అంటాడు. దాంతో డాక్టర్ అత్త షాక్ అవుతుంది. అత్తయ్య మీరు లోపలికి వెళ్లండి. ఇతనితో మాట్లాడాలి అని డాక్టర్ అంటుంది.

కల్యాణ్ నోరు జారడం: రహస్యం బయటపడేనా?

నిన్ను వెధవ అనుకున్నాగారా కానీ, నా కోడలి ముందు నన్ను వెధవని చేశావ్ అని లోపలికి వెళ్తుంది అత్త. రాజ్‌పై తెగ కోప్పడుతుంది డాక్టర్. మీరు తప్పు చేయడం కాకుండా నాతో తప్పు చేయిస్తారా అని డాక్టర్ అంటే.. మిమ్మల్ని ఆపడానికి నాకు ఇంకోదారి కనపడలేదు అని రాజ్ అంటాడు. ఉన్న ఒకే ఒక్కదారి తనతో అబార్షన్ చేయించి కాపాడటం అని డాక్టర్ అంటాడు.

తనకు నిజం తెలియకుండా గొడవ పడుతున్నాను. ఏదోరోజు ఒప్పుకుంటుంది. అప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అప్పటివరకు మీరు నిజం చెప్పకండి. ఒక మనిషిగా ఆలోచించండి. మీకు దండం పెడతాను అని రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య ఇంటికి వెళ్తుంది. డాక్టర్ దగ్గర జరిగింది ఇందిరాదేవికి చెబుతుంది. ఇంతలో కల్యాణ్ వచ్చి ఇందిరాదేవికి తైలం ఇస్తాడు కల్యాణ్ .

మీ అన్నయ్యకు చెబితే నువ్వెందుకు తెచ్చావ్ అని ఇందిరాదేవి అంటుంది. అన్నయ్యకు అర్జంట్ వర్క్ ఉండేసరికి వెళ్లిపోయాడు అని కల్యాణ్ కవర్ చేస్తాడు. కావ్యను ఏంటి వదిన డాక్టర్‌ను కలవలేదుగా అని నోరు జారుతాడు కల్యాణ్. నేను హాస్పిటల్‌కు వెళ్లిన విషయం ఎలా తెలుసు అని కావ్య అడిగితే షాక్ అయిన కల్యాణ్ స్వప్న చెప్పిందని అంటాడు.

మరి డాక్టర్‌ను కలవలేదన్నది ఎలా తెలుసు. నేను ఎవరికి చెప్పలేదుగా అని కావ్య అంటుంది. దాంతో కల్యాణ్ కవర్ చేస్తాడు. తర్వాత బాగా ఆలోచించినా కావ్య మళ్లీ వెళ్లి కల్యాణ్‌ను నిజం చెప్పమని నిలదీస్తుంది కావ్య. మీరు, మీ అన్నయ్య కలిసి నాటకాలు ఎందుకు ఆడుతున్నారు అని గద్దిస్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

రాజ్ పన్నాగం ఎంతవరకు పనిచేస్తుంది? కావ్య నిజం తెలుసుకుంటుందా? కల్యాణ్ నోరు జారడం బ్రహ్మముడి కథకు ఎలాంటి మలుపునిస్తుంది? వంటి ప్రశ్నలకు తదుపరి ఎపిసోడ్‌లో సమాధానాలు లభించనున్నాయి. ఈ ఆసక్తికరమైన మలుపులు ప్రేక్షకులను అలరించనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.