
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 24 ఎపిసోడ్‌లో ఉత్కంఠగా మారింది. అబార్షన్‌కు నిరాకరించిన కావ్యను మోసం చేయాలని దుగ్గిరాల కుటుంబం నిర్ణయించుకుంటుంది. కావ్య అమ్మతనం కోసం మొండిగా నిలబడుతుంది. చివరికి ఆమె స్పృహ తప్పి పడిపోతుంది, దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
Key Points
కావ్య అబార్షన్‌కు నిరాకరించడంతో కుటుంబ సభ్యులు ఆమెను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు.
అమ్మతనం వరం అని, బిడ్డను చంపడం సరికాదని కావ్య మొండిగా వాదిస్తుంది.
కావ్య స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.
కావ్య స్పృహలో లేనప్పుడే అబార్షన్ చేయించాలని ఇందిరా దేవి ప్లాన్ చేస్తుంది.
కావ్యను మోసం చేయాలని కుటుంబ సభ్యుల నిర్ణయం
బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 24) ఎపిసోడ్ లో కావ్యను ఇంట్లో వాళ్లందరూ కలిసి మోసం చేయాలని నిర్ణయించుకుంటారు. ఆమె బతిమాలినా, బెదిరించినా, యుద్ధం ప్రకటించినా వెనక్కి తగ్గకపోవడంతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకుంటారు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 860వ ఎపిసోడ్ కావ్యపై దుగ్గిరాల ఫ్యామిలీ చేసే యుద్ధం, అందరూ వద్దంటున్నా కావ్య మాత్రం అమ్మతనం కోసం మొండిగా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకోవడంలాంటి సీన్లతో సాగిపోయింది. చివరికి సీతారామయ్య చెప్పినా కూడా కావ్య వినకపోవడంతో ఇంట్లో వాళ్లు ఆమెను మోసం చేయడానికి కూడా సిద్ధమవుతారు.
అబార్షన్‌కు నో చెప్పిన కావ్య.. అమ్మతనం కోసం ఆరాటం
ఎందుకు నటిస్తున్నావని నిలదీస్తారు. కానీ కావ్య మాత్రం అమ్మతనం ఓ వరం.. బిడ్డ పుట్టక ముందే ఆ స్వరాన్ని చంపడం కరెక్ట్ కాదు.. నా ప్రాణం పోయినా నా బిడ్డను మాత్రం బతికించుకుంటానని స్పష్టంగా చెబుతుంది.
అమ్మతనం కోసం కావ్య పోరాటం
కావ్యకు రుద్రాణి సపోర్ట్.. తిట్టిన ఇంట్లో వాళ్లు
నీ నుంచి ఇలాంటి మాటలు రావడం ఏంటి.. ఇవాళ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ ఆమెను వెటకారంగా అడుగుతారు. కానీ కావ్య ఏం తప్పు చేసిందని అందరూ అలా నిలదీస్తున్నారని ఆమె తిరిగి ప్రశ్నిస్తుంది.
వెనక్కి తగ్గని కావ్య.. అందుకే నిజం చెప్పలేదన్న రాజ్
ఇన్నాళ్లూ అందరూ తనను నిందించారని, ఓ విలన్ లా చూశారని, కావ్యకు నిజం చెప్పలేదని అన్నారని, నిజం తెలిసినా కావ్య ఇలా చేస్తుందనే తాను చెప్పలేదని అంటాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు.. నా కావ్య నాకు నిండు నూరేళ్ల ఆయుష్షుతో కావాలని చెప్పి వెళ్లిపోతాడు.
స్పృహ తప్పిన కావ్య.. ఇందిరా దేవి షాకింగ్ ప్లాన్
నిర్ణయం మార్చుకోమని కావ్యను కోరిన సీతారామయ్య
మళ్లీ లవర్ దగ్గరికి రాహుల్.. స్వప్నకు విడాకులిస్తానంటూ..
ఇంట్లో వాళ్ల నిరాహారదీక్ష.. కావ్యపై యుద్ధం
దీంతో ఆమె షాక్ తింటుంది. అంతలోనే కావ్య స్పృహ తప్పి పడిపోతుంది. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. ఆమె స్పృహలో లేనప్పుడే అబార్షన్ చేయిస్తే అయిపోతుంది అని ఇందిరాదేవి అంటుంది. ఇదే విషయం డాక్టర్ కు చెబుతాడు రాజ్. అక్కడితో బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే ఇది రేపటి ఎపిసోడ్ పై ఆసక్తి రేపుతోంది.
కావ్య స్పృహ తప్పి పడగా, ఆమెకు తెలియకుండా అబార్షన్ చేయించాలని ఇందిరా దేవి ప్లాన్ చేస్తుంది. ఇది బ్రహ్మముడి సీరియల్ లో కీలక మలుపు. రాబోయే ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది, కావ్య గర్భం ఉంటుందా అనేది వేచి చూడాలి.


