
బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ ఇంటికి తిరిగి రావడంతో అందరూ సంతోషిస్తారు. కానీ కావ్య యాతనలు, యామిని కుట్రలు వెలుగులోకి వస్తాయి. రాజ్ తన బాధ్యతలను గుర్తుంచుకుంటాడు.
Key Points
రాజ్ ఇంటికి తిరిగి వచ్చి కావ్యతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.
కావ్య తన యాతనలను రాజ్‌కు వివరిస్తుంది, యామిని చేసిన కుట్రలను వెల్లడిస్తుంది.
రాజ్ కావ్యను ఎత్తుకుని మెట్లు ఎక్కడం చూసి రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు.
రాజ్ భర్తగా, తండ్రిగా తన బాధ్యతలను స్వీకరిస్తాడు.
రాజ్‌కు కావ్య యాతనల వివరణ
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ ఇంటికి వస్తాడు. అంతా సంతోషంగా ఉంటారు. అందరితో రాజ్ సరదాగా పంచ్‌లు వేస్తూ నవ్వించడం చూసి కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోతుంది కావ్య. అది చూసిన రాజ్ ఏమైందని అడుగుతాడు. కావ్య నరకం అనుభవించింది, కట్టుకున్న వాడే అవమానిస్తే ఎలా ఉంటుంది అని ధాన్యలక్ష్మీ నోరు జారుతుంది.
దాంతో గుచ్చి గుచ్చి అడుగుతాడు రాజ్. కొడుకు అలా అడిగేసరికి అపర్ణ జరిగింది అంతా చెబుతుంది. రామ్‌లా రాజ్ మారింది, యామిని చేసిన కుట్రలు అంతా చెప్పేస్తుంది అపర్ణ. దాంతో కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. నాకు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో తెలియట్లేదు అని రాజ్ అంటాడు. ఇంతలో కావ్య వెంటనే వచ్చి రాజ్‌ను ప్రేమగా హత్తుకుంటుంది.
కొద్దిసేపు ఇద్దరు అలాగే ఉండిపోతారు. అన్ని రోజులు తాను పడిన నరకవేదన గురించి భర్తకు చెబుతుంది కావ్య. యామిని అడుగడుగునా మిమ్మల్ని దగ్గరికి చేసుకోవాలని ఎంతో ప్రయత్నించింది, నా మీద కోపంతో మిమ్మల్ని ఇబ్బందిపెట్టేది, ఆఖరికి మీకు తాగుడు కూడా అలవాటు చేయించింది అని యామిని వల్ల పడిన కష్టాలు చెప్పుకుంటుంది కావ్య.
రాజ్ భర్త, తండ్రిగా బాధ్యతలు స్వీకరణ
ఎవరు ఏం చేసిన నీ నుంచి నన్ను దూరం చేయలేరని నువ్ నిరూపించావ్. ఎప్పటికీ మనం ఇలాగే కలిసి ఉంటాం. మనది విడిపోని బ్రహ్మముడి . కానీ, ఇన్నాళ్లు నువ్వు ఇంత బాధపడ్డావ్ అంటేనే అదోలా ఉంది అని రాజ్ అంటాడు. మీరు అలా బాధపడకండి. ఏం జరిగినా అంతా మంచికే జరిగింది. మీరు క్షేమంగా ఉన్నారు. అది చాలు అని కావ్య చెబుతుంది.
తర్వాత మీరు తండ్రి కాబోతున్నారు అని కడుపులో ఉన్న బిడ్డ గురించి చెబుతుంది కావ్య. దాంతో తెగ సంతోషంగా ఫీల్ అయిన రాజ్ ఇన్నాళ్లు నీకు భర్తగా అండగా లేకపోయాను. కానీ, ఇక నుంచి నీకు అసలైన భర్తగా, మన బిడ్డకు తండ్రిగా బాధ్యతలు తీసుకుంటాను. నీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను అని రాజ్ ఎమోషనల్‌గా చెబుతాడు.
మరుసటి రోజు కావ్య మెట్లు ఎక్కుతుంటుంది. అది చూసిన రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు. నీకు అసలు బుద్ధి ఉందా. కడుపుతో ఉన్న మనిషి ఇలాంటి మెట్లు ఎక్కుతుందా అని రాజ్ కోప్పడతాడు. మరి ఇప్పుడు నేను నడవకుండా ఈ మెట్లు ఎలా ఎక్కాలి. మీరు గానీ ఎత్తుకుని తీసుకెళ్తారా ఏంటీ అని కావ్య అంటుంది.
రుద్రాణి, రాహుల్ ఆశ్చర్యం
వెళ్తారా ఏంటీ తీసుకెళ్తాను అని కావ్యను ఎత్తుకుంటాడు రాజ్. ఎత్తుకుని మెట్లు ఎక్కి గదిలోకి కావ్యను తీసుకెళ్తాడు రాజ్. కావ్య, రాజ్ సంతోషంగా ఉండటం రుద్రాణి , రాహుల్ ఇద్దరు చూస్తారు. ఏంటీ మమ్మీ ఇలా జరిగింది అని రాహుల్ అంటాడు. అంతా బాగా మనకు ఫేవర్ జరుగుతుందనుకున్న సమయంలో యామినినే కొంప ముంచిందని రుద్రాణి అంటుంది.
కావ్య కడుపులో బిడ్డ గురించి తెలిసి రాజ్ అలాగే తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. వాడి సంగతి యామిని చూసుకుంటుంది. ఇక ఆస్తి మొత్తం మన చేతుల్లోకి తీసుకోవచ్చు అనుకున్నా. కానీ, రాజ్‌ను రెచ్చగొట్టి ఇంటికి పంపడమే కాకుండా తాను కూడా వచ్చి ఓ తెగ ఓవరాక్షన్ చేసింది. అందుకే అపర్ణ వదిన మొత్తం నిజం చెప్పేసిందని రుద్రాణి అంటుంది.
దాంతో రాజ్‌కు గతం గుర్తుకు వచ్చేలా చేసింది ఆ యామిని. మన ఆశలన్నింటిని గల్లంతు చేసింది అని రుద్రాణి యామిని పై కోప్పడుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
చివరికి, రాజ్ తన తప్పులను గ్రహించి, కావ్యకు అండగా నిలుస్తాడు. వారి బంధం మరింత బలపడుతుంది. రుద్రాణి, రాహుల్‌ల ఆశలు నిరాశగా మారతాయి.


