|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి: రాజ్ పెళ్ళిలో ట్విస్ట్! భార్యగా ఇందు ఎంట్రీతో షాక్! నందు సీక్రెట్ ఆపరేషన్!

Published: 16-04-2026, 12:05 AM
బ్రహ్మముడి: రాజ్ పెళ్ళిలో ట్విస్ట్! భార్యగా ఇందు ఎంట్రీతో షాక్! నందు సీక్రెట్ ఆపరేషన్!
  • బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ భార్యగా ఇందు ఎంట్రీ: ఊహించని ట్విస్ట్!
  • ఇంట్లోకి దొంగచాటుగా నందు ప్రవేశం: అసలు ప్లాన్ ఏమిటి?
  • అక్కను కనిపెట్టేసిన చెల్లి: కిడ్నాప్ మిస్టరీకి ఎండ్ కార్డ్?
  • పోలీసుల సోదాతో రాజ్, లక్కీ టెన్షన్: దొరికిపోతారా?

బ్రహ్మముడి సీరియల్‌లో బిగ్ ట్విస్ట్! రాజ్ జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందు ఎంట్రీతో కథ మొత్తం మారిపోయింది. అసలు ఏం జరగబోతుందో చూడాలి.

రాజ్ జీవితంలో ఊహించని ట్విస్ట్!

Brahmamudi Serial April 16th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 16వ ఎపిసోడ్‌లో ఇందును ఎక్కడ దాచిపెట్టారో ఆ ఏరియా ట్రేస్ అవుతుంది. దాంతో ఆ అడ్రస్ తీసుకుని ఇందు బయలుదేరుతుంది. మరోవైపు రాజ్, లక్కీ ఇంట్లోకి పోలీసులు వస్తారు. దొంగకోసం వచ్చామని ఇల్లు వెతకాలంటారు. లక్కీ కొత్త డ్రామా స్టార్ట్ చేస్తాడు.

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో డబ్బులు కుదరదంటే ఇందు వేళ్లు కత్తిరించి పంపిస్తానని రాజ్ బెదిరిస్తాడు. దాంతో భయపడిన భ్రమరాంబ అలా చేస్తే సంతకం ఎలా పెడుతుందంటుంది. ఫోన్ లాక్కున్న రేఖ కోటి రూపాయలను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తానని చెబుతుంది. సరేనని రాజ్ అంటాడు.

మరోవైపు రాజ్, లక్కీ ఈ సిటీలో మూడు కోట్లు ఉన్నా మధ్య తరగతి వాళ్ల కిందకే వస్తామని మాట్లాడుకుంటారు. ఇంతలో ఇందును కిడ్నాప్ చేసి దాచి ఉంచిన ఇంట్లోకి పోలీసులు వస్తారు. రాజ్, లక్కీ కంగారుపడతారు. ఇల్లు మొత్తం సోదా చేయాలని ఎస్సై అంటాడు. ఎందుకు సోదా చేయాలని రాజ్ అడిగితే.. పక్క వీధిలో దొంగతనం జరిగింది. వాడు తప్పించుకుని ఇటువైపే వచ్చాడట. అందుకే ఇల్లు సోదా చేయాలని ఎస్సై అంటాడు.

నందు సీక్రెట్ ఎంట్రీ: ప్లాన్ సక్సెస్ అవుతుందా?

మరోవైపు తాళం తీసుకుని ఇందు వస్తుంటుంది. దొంగ కోసమా అని ఊపిరి పీల్చుకుంటారు రాజ్, లక్కీ. ఆ దొంగ మాములోడు కాదు ఇప్పటికీ చాలా మందిని చంపేశాడు. ఇంట్లో దాక్కున్న విషయం కూడా ఎవరికి తెలియదు అని ఎస్సై అంటాడు. ఇంతలో ఇందు వస్తుంది. ఈ అమ్మాయి ఎవరని ఎస్సై అడుగుతాడు. తను నా ఫ్రెండ్ వైఫ్ సర్ అని లక్కీ అంటాడు. దాంతో రాజ్ , ఇందు షాక్ అవుతారు.

ఇంతలో ఎస్సై లేపి ఇలాంటి ఫ్రెండ్ ఉండటం మీ ఇద్దరి అదృష్టం. ఈ మధ్య ఇగోకి పోయి విడిపోవడం ప్యాషన్ అయిపోయిందని లెక్చర్ ఇస్తాడు ఎస్సై. ఇన్ని గొడవల మధ్యలో దొంగ ఎప్పుడో పారిపోయి ఉంటాడు అని ఎస్సై వెళ్లిపోతాడు. మరోవైపు నందుతో వెంకట్ ఉంటాడు. తన లవ్ కోసం హెల్ప్ చేయమంటాడు. దాంతో తను ఓ కిడ్నాప్ అయిన అమ్మాయిని వెతుకుతున్నానని వెంకట్‌పై కోప్పడుతుంది నందు.

తర్వాత సరేనని హెల్ప్ చేస్తానంటుంది నందు. దానికి ఆ అమ్మాయి దొరికేవరకు నేను హెల్ప్ చేస్తానంటాడు వెంకట్. ఇంతలో ఓ ఇంటి నుంచి ఎస్సై బయటకు వస్తాడు. నందును చూసి మత్తు పదార్థాల కేసు గురించి అడుగుతాడు. వాళ్లను పట్టుకుని లాభం లేదు. మెయిన్ తలను పట్టుకోవాలని నందు చెబుతుంది. తాను దొంగ కోసం వచ్చినట్లు ఎస్సై చెబితే.. ఎవరైనా అనుమానంగా కనిపించారా అని ఇందు కిడ్నాప్ కేసు గురించి చెబుతుంది.

కిడ్నాప్ మిస్టరీకి చెక్ పెట్టేది ఎవరు?

నువ్వు ఇక్కడ ఉండటం ఎంత అవసరమో మాకు అంతే అవసరం అని ఇందు ప్లాన్ గురించి బయటపెడతాడు రాజ్. నాకు ఇక్కడ ఉండాలని లేదు. మీకు ఎంత డబ్బు కావాలో చెబితే ఇస్తాను. విడిచిపెట్టండి అని ఇందు అంటుంది. దాంతో రాజ్, లక్కీ నవ్వుతారు. నీకు బ్యాక్ అకౌంట్ లేదు మాకు డబ్బులిస్తావా, నువ్వు సంతకం పెట్టడం తప్ప నీ దగ్గర చిల్లి గవ్వ లేదని అని ఎగతాలి చేస్తారు.

దాంతో నవ్వేస్తుంది ఇందు. మా రేఖ ఆంటీ కోటి ఇవ్వడానికి రెడీ అయిందంటే నేను పెట్టే సంతకం ఎంత విలువైందో అర్థం కాలేదా. నేను దుగ్గిరాల ఇంటి వారసురాలిని, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి కాబోయే ఛైర్మన్‌ను, నన్ను వదిలేస్తే అడిగినదానికి ఎక్కువే ఇస్తానంటుంది ఇందు. ఎప్పుడిస్తావని రాజ్ అడిగితే.. ఇప్పుడు కాదు. నా ప్లాన్స్ వర్కౌట్ అయి ఛైర్మన్ అయ్యాక వెంటనే ఇచ్చేస్తాను అంటుంది ఇందు.

రాజ్, లక్కీ దాచిన ఇల్లు చూసి ఈ ఏరియాలో ఈ ఇల్లే డిఫరెంట్‌గా ఉందని లోపలికి వెళ్తుంది నందు. తర్వాత రాజ్, లక్కీ పడుకుని ఉంటారు. కిడ్నాప్ అయిన ఇంట్లోకి వెళ్లి అక్క ఇందును కనిపెట్టి చూస్తుంది చెల్లి నందు. అక్క అని పిలుస్తుంది. నిజం చెప్పు ఇదంతా నాకోసం ఎందుకు చేస్తున్నావని నందును ఎమోషనల్‌గా అడుగుతుంది ఇందు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ కథనం చాలా ఆసక్తికరంగా మారుతోంది. రాజ్, ఇందుల మధ్య ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.