
📌 Key Points
- రామ్ చరణ్, బుచ్చిబాబుల ‘పెద్ది’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
- కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘గౌర్నాయుడు’ పాత్రలో నటిస్తున్నట్లు వీడియో విడుదల.
- సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు.
- మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సహకారంతో హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మాణం.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘గౌర్నాయుడు’గా పవర్ ఫుల్ ఎంట్రీ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, హై టెక్నికల్ వాల్యూస్‌తో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
‘పెద్ది’ ఫీవర్: అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి
Peddi Fever : మరో 20 రోజుల్లో పెద్ది రానుండటం తో ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ది ఫీవరే కనిపిస్తుంది.రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు టాలీవుడ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిందనే చెప్పాలి. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పక్కా మాస్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది.
శివరాజ్ కుమార్ ‘గౌర్నాయుడు’గా పవర్ ఫుల్ వీడియో
ఈ చిత్రంలో కన్నడ సెన్సేషన్, సెంచరీ స్టార్ శివరాజ్ కుమార్ ‘గౌర్నాయుడు’గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పవర్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో శివరాజ్ కుమార్ కుస్తీ బరిలో కనిపిస్తున్న తీరు, ఆయన కళ్లలో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోని డ్రామా ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పేస్తుంది.ఇక ‘ఉప్పెన’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బుచ్చిబాబు, ఇప్పుడు చరణ్‌ను మునుపెన్నడూ చూడని ఒక కొత్త మేకోవర్‌లో చూపించబోతున్నాడని వస్తున్న అప్ డేట్స్ ని బట్టే అర్థమవుతుంది.
Gournaidu a.k.a @nimmashivanna garu❤️🔥❤️🔥
Step into the raw world of #PEDDI #PEDDITrailer in 4 days 🔥
శివరాజ్ కుమార్ ‘గౌర్నాయుడు’గా పవర్ ఫుల్ ఎంట్రీ
Peddi in cinemas worldwide on 4th June. #GetReadyForPeddi 💥💥 pic.twitter.com/bZDwmdoQNq
— PEDDI (@PeddiMovieOffl) May 14, 2026
ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తామంటున్న మేకర్స్
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి.మరో వైపు నేషనల్ వైడ్ గా ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తామని మేకర్స్ పెద్ద పెద్ద ప్లాన్లే వేస్తున్నారు. ఇక ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తుండగా, సినిమా ఎడిట్ ఇప్పటికే లాక్ అయిపోయిందని సమాచారం. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం.దానికి తోడు వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మాంచి హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం సినిమాని మరో మెట్టు ఎక్కించేదే.
ప్రమోషన్స్, హై టెక్నికల్ వాల్యూస్
వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయం
ఇక హీరోయిన్ విషయానికి వస్తే, అతిలోక సుందరి శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ ఈ సినిమాలో చరణ్ సరసన మెరవబోతున్న సంగతి తెల్సిందే.ఇక ‘దేవర’ తర్వాత ఆమె నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో బాలీవుడ్ మీడియాలో కూడా ‘పెద్ది’ పై భారీ అంచనాలే ఉన్నాయ్.ఇక వీరిద్దరి జంట వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది కూడా . అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వెర్సటైల్ యాక్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం.
మే 18న ముంబైలో’పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్
ఇక జూన్ 4 న రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మే 18న ముంబైలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ నుంచి పాన్ ఇండియా ప్రమోషన్స్ సరికొత్త ఊపు అందుకోనున్నాయని సమాచారం. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మెగా అభిమానుల్లో జోష్ డబల్ అయిపోతుంది. జూన్ 3, 2026న భారీ ఎత్తున ప్రీమియర్ షోలతో మొదలై, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘పెద్ది’ రాబోతోంది. సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు విజువల్స్, అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని టీమ్ మంచి కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. మొత్తానికి శివరాజ్ కుమార్ ‘గౌర్నాయుడు’ లుక్ ఈ సినిమాపై అంచనాలను మరో మెట్టు ఎక్కించింది. చరణ్ మాస్ పవర్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం అని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు మెగా ఫ్యాన్స్ .చూడాలి పుష్ప రికార్డులని బీట్ చేయాలని ఆశ పడుతున్న చరణ్ ఆశలు పెద్ది నెరవేరుస్తాడో లేదో !
‘పెద్ది’ చిత్రం కేవలం ఒక సినిమా కాదు, ఒక సంచలనం కాబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్, శివన్న ఎంట్రీ, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.


