|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది విడుదల వాయిదా? రామ్ చరణ్ సినిమాకు హైకోర్టు షాక్! టికెట్ల ధరలే కారణమా?

Published: 22-01-2026, 3:35 AM
పెద్ది విడుదల వాయిదా? రామ్ చరణ్ సినిమాకు హైకోర్టు షాక్! టికెట్ల ధరలే కారణమా?
  • రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
  • బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ మార్చి 27న విడుదల కావాల్సి ఉంది.
  • సినిమా 75% షూటింగ్ పూర్తి కాగా, ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయింది.
  • టికెట్ ధరల పెంపునకు హైకోర్టు 90 రోజుల నిబంధన విధించడంతో సమస్యలు.

రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ మూవీ మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే టికెట్ ధరల పెంపునకు హైకోర్టు అడ్డంకులు సృష్టిస్తుండటంతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.

మార్చి 27న ‘పెద్ది’ విడుదల సాధ్యమేనా?

Peddi: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ (Ram Charan). ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ సినిమా చేశారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు రామ్ చరణ్. అందులో భాగంగానే బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మేరకు రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది మార్చి 27వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ సినిమా సర్వం సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే దాదాపు 75% పైగా షూటింగ్ పూర్తయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిందట. అటు మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) కి ఆర్ఆర్ వర్క్ కోసం పంపించినట్లు సమాచారం. మిగతా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అది కూడా తొందరలోనే కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి 27వ తేదీన రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

టికెట్ ధరల పెంపుపై నిర్మాతల ఆశలు

ఇకపోతే కథ పరంగా ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కి సిద్ధమవుతోంది. కానీ టికెట్ ధరల పెంపు అనేది సినిమాకు చాలా అవసరం. ఎందుకంటే భారీ బడ్జెట్ తో సినిమా వస్తోంది కాబట్టి నిర్మాతలు తమ బడ్జెట్ ను రాబట్టుకోవాలి అంటే టికెట్ ధరల పెంపు అనేది కచ్చితంగా అత్యవసరం. అందుకే నిర్మాతలు కూడా టికెట్ ధరల పెంపు గురించి ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల తెలంగాణ హైకోర్టు సినిమా టికెట్ ధరల పెంపు గురించి 90 రోజుల నిబంధన పెట్టింది. అంటే ఎవరైతే తమ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవాలని చూస్తున్నారో మూడు నెలల ముందే ప్రభుత్వాల పర్మిషన్ తీసుకోవాలని కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ టికెట్టు ధరల పెంపు గురించి మేకర్స్ ఆలోచిస్తున్నట్లయితే ఈ ఒక్క కారణం చేత సినిమా విడుదల వాయిదా పడొచ్చు.. ఇక మిగతాదంతా సాఫీగానే జరుగుతోంది.

హైకోర్టు నిబంధనలతో విడుదల వాయిదా?

మరి ఈ సినిమా విడుదలను మార్చి 27న రిలీజ్ చేస్తే టికెట్ ధరల పెంపు గురించి నిర్మాతలు మరిచిపోవాల్సిందే. మరి నిర్మాతల ఆలోచన ఏ వైపు ఉందో తెలియాలి. ఏది ఏమైనా టికెట్ ధరలు అత్యవసరం కాబట్టి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని మరి కొంతమంది సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు.

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. వేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సీక్వెల్ లో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాతో మరో మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి రామ్ చరణ్ సిద్ధం అయ్యారని చెప్పవచ్చు.

అన్ని అనుకున్నట్లు జరిగితే ‘పెద్ది’ మార్చి 27న విడుదల కానుంది. లేదంటే టికెట్ ధరల పెంపు సమస్య కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.