📌 Key Points
- మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో రెబల్ పాత్రలో నటిస్తున్నారు.
- ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైంది.
- మనోజ్ ఈ చిత్రంలో ఇదివరకు ఎన్నడూ చూడని క్రూరమైన పాత్రలో కనిపించనున్నారు.
- ‘డేవిడ్ రెడ్డి’ సినిమా బ్రిటిష్ కాలం నాటి చారిత్రక కథాంశంతో రూపొందుతోంది.
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘డేవిడ్ రెడ్డి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్లో మనోజ్ రెబల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా బ్రిటిష్ కాలం నాటి కథతో రూపొందుతోంది.
డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ విడుదల
David Reddy film: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు పలు సినిమాలకు సంబంధించి బిగ్ అప్డేట్ తెలియజేస్తూ వచ్చారు.. ఇప్పటికే రవితేజ సినిమాకు సంబంధించిన అప్డేట్ వెలువడగా తాజాగా మంచు మనోజ్(Manchu Manoj) డేవిడ్ రెడ్డి (David Reddy)సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇటీవల మిరాయ్ సినిమాతో విలన్ గా ప్రేక్షకులను మెప్పించారు. ఇక తాజాగా మరొక విభిన్నమైన కథతో డేవిడ్ రెడ్డి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇదివరకే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ విడుదల చేయగా ఈ టైటిల్ పోస్టర్ అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక నేడు మనోజ్ పస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మనోజ్ చాలా క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టం అవుతుంది . ఇదివరకు మనోజ్ ఈ తరహా పాత్రలలో ఏ సినిమాలో కూడా నటించలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పస్ట్ లు పోస్టర్ ను మనోజ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..”నాలో ఈ సరికొత్త కోణం క్రూరమైనది, పశ్చాత్తాపం లేనిది అంటూ చెప్పుకోవచ్చారు.. మనోజ్ పోస్ట్ చూస్తుంటే ఈ సినిమాలో ఈయన చాలా క్రూరంగా కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.
హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో ఉండబోతుంది మద్రాస్ ప్రెసిడెంట్ లో పుట్టి, ఢిల్లీలో పెరిగి, బ్రిటిష్ పాలకులను అంతమొందించిన ఒక రెబల్ కథగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ పోస్టర్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమాకు హనుమారెడ్డి యక్కంటి దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్ బ్యానర్ పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రెబల్ పాత్రలో మంచు మనోజ్
A whole new dimension within me. Raw. Ruthless. Unapologetic. #DavidReddy pic.twitter.com/vRjG7Rlm4y
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 26, 2026
బ్రిటిష్ కాలం నాటి కథాంశం
ఇలా మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కచ్చితంగా మనోజ్ కెరియర్ లో కీలకంగా, ఎంతో ప్రత్యేకంగా మారబోతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న మనోజ్ తన వ్యక్తిగత కారణాలవల్ల దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా తొమ్మిదేళ్ల తర్వాత ఈయన భైరవం సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు.
మొత్తానికి, డేవిడ్ రెడ్డి సినిమా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచుతుంది. మనోజ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.


