|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బన్నీలా ఎదగలేకపోయావ్‌.. గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌.. రెండు ప్రాపర్టీలు అమ్ముకునేవాడిని..

Published: 30-06-2025, 10:21 AM
బన్నీలా ఎదగలేకపోయావ్‌.. గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌.. రెండు ప్రాపర్టీలు అమ్ముకునేవాడిని..

నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజుతో ఓ ఆసక్తికరమైన ఇంటర్వ్యూ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో నితిన్ కెరీర్, గేమ్ ఛేంజర్ సినిమా నష్టాలు, దిల్ రాజుతో ఆయనకున్న సంబంధం గురించి చర్చించారు.

నితిన్, దిల్ రాజు మధ్య సంభాషణ

నితిన్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ తమ్ముడు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ గట్టిగా చేస్తోంది చిత్రయూనిట్‌. ఈ క్రమంలో దిల్‌ X తమ్ముడు పేరుతో ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు.

సత్సంబంధాలు లేకపోయినా.. నితిన్‌ మాట్లాడుతూ.. దిల్‌రాజు ( Dil Raju )ను నేను అంకుల్‌ అని పిలిచేవాడిని. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న, రాజు కలిసి తొలిప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఆ సినిమా హిట్టయినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్లాం. అలా రాజుతో పరిచయం ఏర్పడింది. 2005లో రామ్‌ సినిమా చేశాను. అప్పుడు రిలీజ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మన మధ్య సత్సంబంధాలు లేకపోయినా మీరు వచ్చి కొంత అమౌంట్‌ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. చాలామంది హీరోలకు, నిర్మాతలకు సాయం చేశారు. అలాంటిది మీరు సినిమాలను తొక్కేస్తారన్న విమర్శలు విన్నప్పుడు బాధేసింది అని చెప్పుకొచ్చాడు.

గేమ్ ఛేంజర్ సినిమా నష్టాలు

జయం సినిమాకు ముందే.. దిల్‌ రాజు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. జయం సినిమా పోస్టర్స్‌ చూసి ఈ కుర్రాడు భలే ఉన్నాడనుకున్నాను. అప్పుడు నువ్వు ఎవరో కాదు, సుధాకర్‌ రెడ్డి కుమారుడు అనగానే.. మరింకే, నితిన్‌తో సినిమా చేద్దామని వినాయక్‌తో అన్నాను. అలా జయం రిలీజ్‌కు ముందే దిల్‌ మూవీ ఫిక్స్‌ చేశాం. కాకపోతే దిల్‌ టైటిల్‌ బూరుగుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఉంది. ఆయన దగ్గరకు వెళ్లి ఈ టైటిల్‌ మా సినిమాకు బాగుంటుందని అడగ్గానే ఇచ్చారు. ఆయన టైటిల్‌ ఇవ్వడం వల్లే ‘దిల్‌’ రాజు అనేది ఒక బ్రాండ్‌ అయిపోయింది.

గేమ్‌ ఛేంజర్‌ నష్టాలు నేను 2003లో నిర్మాతనయ్యాను. నువ్వు 2002లో హీరో అయ్యావు. నాకంటే ఒక ఏడాది సీనియర్‌వి. నేను జూనియర్‌ను. అయినా నేను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ టాప్‌ పొజిషన్‌లోకి వచ్చాను. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్‌ను, దిల్‌ సినిమా చేస్తున్నప్పుడు నితిన్‌ ( Nithiin )ను ఫ్యూచర్‌ స్టార్స్‌ అని ఊహించాను. కానీ, నువ్వు ఆ స్థాయికి రాలేకపోయావు. అదే నువ్వు కోల్పోయావు. తమ్ముడుతో సక్సెస్‌ వస్తుంది కానీ పూర్వ వైభవం రావడానికి అది సరిపోదు అన్నాడు.

నితిన్ కెరీర్ పై దిల్ రాజు అభిప్రాయం

రెండు ప్రాపర్టీలు అమ్ముకుంటా.. గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌ గురించి ఓపెన్‌ అవుతూ.. జనవరి 10న గేమ్‌ ఛేంజర్‌ రిలీజవగానే నాకు నష్టం రాబోతుందని అర్థమైంది. కాకపోతే 14న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం కచ్చితంగా హిట్‌ కొడుతుందని నమ్మకంగా ఉన్నాను. ఒకవేళ ఆ సినిమా లేకపోయినా.. రెండు ప్రాపర్టీలు అమ్ముకుని ఆ నష్టాల నుంచి బయటపడేవాడిని. అది పెద్ద విషయం కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నితిన్‌కు.. తమ్ముడు సినిమా విజయాన్ని సాధించి పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

నితిన్ మరియు దిల్ రాజు మధ్య జరిగిన ఈ సంభాషణ తెలుగు సినీ పరిశ్రమలోని విజయాలు, వైఫల్యాలు, వ్యక్తిగత సంబంధాల గురించి అనేక విషయాలను వెల్లడిస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమా నష్టాల వల్ల దిల్ రాజు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఈ ఇంటర్వ్యూ హైలైట్ చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.