
నిర్మాత బన్నీ వాసు తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ప్రేమ లేకపోవడానికి అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్లను కారణం అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Key Points
బన్నీ వాసు తన జీవితంలో ప్రేమ లేకపోవడానికి అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్లను కారణం అన్నారు.
అల్లు అరవింద్ తో 19 ఏళ్ళ వయసు నుండి తనకు ఉన్న సంబంధాన్ని వివరించారు.
అల్లు అర్జున్ తో తనకున్న సన్నిహిత స్నేహం గురించి చెప్పారు.
బన్నీ వాసు మరియు అల్లు అర్జున్ కలిసి అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.
బన్నీ వాసు షాకింగ్ వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తన జీవితంలో లవ్ పార్ట్ లేకపోవడానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ లే కారణం అని నిర్మాత బన్నీ వాసు షాకింగ్ కామెంట్లు చేశారు. మిత్ర మండలి సినిమా ఈవెంట్‌లో బన్నీవాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి దండ్రుల కంటే తాను అల్లు అరవింద్‌తోనే ఎక్కువ సమయం గడిపానని చెప్పారు. అల్లు అరవింద్ తనకు గాఢ్ ఫాదర్ లాంటి వారని చెప్పారు. 19ఏళ్ల వయసు ఉన్నప్పుడే అల్లు అరవింద్ దగ్గరకు వచ్చానని అన్నారు. అప్పటి నుండి తనను అల్లు అర్జున్ దగ్గర వాచ్ మెన్‌గా పెట్టేశారని వ్యాఖ్యానించారు.
తన జీవితంలో లవ్ పార్ట్ మిస్ అయ్యింది అంటే దానికి కారణం అల్లు అర్జున్, అల్లు అరవింద్ లే అని సరదాగా అన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, బన్నీ వాస్ సంయుక్తంగా అనేక సినిమాలను నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 100 పర్సెంట్ లవ్, భలే భలే మొగాడివోయ్ లాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. బన్నీవాస్ నిర్మాత మాత్రమే కాకుండా అల్లు అర్జున్ కు మంచి స్నేహితుడు. వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంటుంది.
అల్లు అరవింద్, అల్లు అర్జున్ తో సంబంధం
సినిమా రంగంలో బన్నీ వాసు ప్రస్తావన
బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ తో ఆయనకున్న అనుబంధం, సినిమా రంగంలో వారి సహకారం గురించి ఈ వార్త తెలియజేస్తుంది.


