|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు

Published: 18-11-2025, 3:21 AM
దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిపై కేసు నమోదైంది. మహేష్ బాబు సినిమా గ్లింప్స్ విడుదల ఈవెంట్‌లో హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం ఫిర్యాదు చేసింది.

Key Points

1

దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిపై సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

2

మహేష్‌ బాబుతో కలిసి చేస్తున్న సినిమా 'వారణాసి' గ్లింప్స్‌ ఈవెంట్‌లో వివాదం మొదలైంది.

4

పదే పదే సాంకేతిక ఆటంకాలు రావడంతో హనుమంతుడిపై అసహనం వ్యక్తం చేశారు.

రాజమౌళిపై కేసు నమోదు: అసలు కారణం

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిపై కేసు నమోదైంది. మహేష్‌ బాబుతో కలిసి భారీ బడ్జెట్‌తో ఆయన ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా గ్లోబ్‌ట్రాటర్‌ పేరుతో ఒక ఈవెంట్‌ను జరిపిన విషయం తెలిసిందే.. ఈ వేదికపై హనుమంతుడి గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు దుమారమయ్యాయి. దీంతో సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.

వారణాసి గ్లింప్స్ ఈవెంట్: వివాదాస్పద వ్యాఖ్యలు

ఏం జరిగింది..? మహేష్‌ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల కోసం పెద్ద ఎత్తున ఒక ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో   మొదట కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ..  వారణాసి కోసం మహేష్‌ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారని ఆయన అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్‌ ఉన్నాడని విజయేంద్రప్రసాద్‌  చెప్పారు.

రాజమౌళి వ్యాఖ్యలపై ఫిర్యాదు

అయితే,   వారణాసి గ్లింప్స్ విడియో రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు. ‘నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది. ఆయన (హనుమంతుడు) ఉంటే ఇదేనా నడిపించేది..?’  అని అసహనం వ్యక్తం చేశారు.  దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉన్నాయని నెటిజన్లు ఫైర్‌ అయ్యారు.

రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.