|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్యాస్ రీఫిల్ నిబంధనలపై కేంద్రం సంచలన ప్రకటన! ఆందోళన వద్దు, అన్నీ అదుపులోనే!

Published: 25-03-2026, 4:35 AM
గ్యాస్ రీఫిల్ నిబంధనలపై కేంద్రం సంచలన ప్రకటన! ఆందోళన వద్దు, అన్నీ అదుపులోనే!
  • గ్యాస్ రీఫిల్ బుకింగ్ నిబంధనలు మారలేదని కేంద్రం స్పష్టీకరణ
  • సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటన
  • ప్రస్తుతం ఉన్న గడువులే కొనసాగుతాయని కేంద్రం భరోసా
  • అసత్య వార్తలను నమ్మి పానిక్ బుకింగ్స్ చేయవద్దని విజ్ఞప్తి

దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందనే వార్తల నేపథ్యంలో, గ్యాస్ రీఫిల్ బుకింగ్ నిబంధనలు మారాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. నిబంధనలు ఏమీ మారలేదని తేల్చి చెప్పింది.

సోషల్ మీడియాలో గ్యాస్ కొరత వార్తలు

ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత దేశంలో గ్యాస్ కొరత (Gas shortage) ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం ఆయిల్ కంపెనీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటుంది. అయితే గ్యాస్ కొరత కారణంతో దేశంలో ఫేక్ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి బుకింగ్ కి 45 రోజులకు పెంచినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్ గడువులకు (Refill booking deadlines)సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తాజాగా స్పష్టతనిచ్చింది.

గ్యాస్ బుకింగ్ నియమ నిబంధనలు మారాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ప్రస్తుతం అమలులో ఉన్న గడువులే కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత తదుపరి రీఫిల్ కోసం 25 రోజులకు బుకింగ్ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు ఈ గడువు 45 రోజులుగా ఉంది. ఈ కాలపరిమితుల్లో ఎటువంటి మార్పులు చేయలేదని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలను నమ్మి పానిక్ బుకింగ్స్ చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

కేంద్రం స్పష్టీకరణ – నిబంధనలు యథాతథం

వినియోగదారులకు ప్రభుత్వ సూచన

కాబట్టి, వినియోగదారులు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని కేంద్రం భరోసా ఇచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.