|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘చాయ్ వాలా’ టైటిల్ ఛేంజ్! హీరోయిన్ మాస్ అప్డేట్.. ఇకపై ‘నవాబ్ కేఫ్’!

Published: 10-02-2026, 6:35 AM
షాకింగ్: 'చాయ్ వాలా' టైటిల్ ఛేంజ్! హీరోయిన్ మాస్ అప్డేట్.. ఇకపై 'నవాబ్ కేఫ్'!
  • శివ కందుకూరి హీరోగా ‘నవాబ్ కేఫ్’ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల!
  • హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిధా విజయలక్ష్మి, వెంకట్ నిర్మాణ బాధ్యతలు!
  • తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజీవ్ కనకాల పవర్ఫుల్ పాత్రలో!
  • తండ్రీ కొడుకుల అనుబంధం నేపధ్యంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా!

శివ కందుకూరి హీరోగా వస్తున్న ‘చాయ్ వాలా’ మూవీ టైటిల్ ఒక్కసారిగా మారింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. అసలు టైటిల్ ఎందుకు మార్చారో తెలుసా?

టైటిల్ మార్పుకు కారణం ఇదేనా?

శివ కందుకూరి(Shiva Kandukuri) హీరోగా, ప్రమోద్ హర్ష (Pramod Harsha)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘చాయ్ వాలా’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో..తాజాగా మూవీ మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్‌ను అనూహ్యంగా మారుస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ‘చాయ్ వాలా’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘నవాబ్ కేఫ్’(Nawab Cafe) అనే కొత్త పేరును ఖరారు చేశారు.

‘నవాబ్ కేఫ్’గా మారిన ‘చాయ్ వాలా’!

ఈ విషయాన్ని హీరోయిన్ తేజు అశ్విని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. హర్షిక ప్రొడక్షన్ బ్యానర్‌పై రిధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ పాపుడిప్పు నిర్మిస్తున్న ఈ చిత్రం.. తండ్రి, కొడుకుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగనుంది. ఇందులో రాజీవ్ కనకాల ఒక పవర్‌ఫుల్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండటం విశేషం. కాగా, ఫిబ్రవరి 20న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే విడుదలకి మరికొద్ది రోజులే సమయం ఉన్న సమయంలో టైటిల్ మార్చడం వెనుక గల కారణాలు ఏమై ఉంటాయని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కథలోని లోతును, ఎమోషన్‌ను మరింత ప్రభావవంతంగా చూపించడానికే ఈ ‘నవాబ్ కేఫ్’ అనే పేరును ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లోని టాక్.

ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్!

A post shared by Shiva Kandukuri (@shivakandukuri)

చివరి నిమిషంలో టైటిల్ మార్పు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. తండ్రీ కొడుకుల అనుబంధం వెండితెరపై ఎలా ఉంటుందో చూడటానికి వేచి ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.