
📌 Key Points
- భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
- 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం.
- రైతులకు ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
- గత ప్రభుత్వాలు రాష్ట్రంలో భూ వివాదాలు సృష్టించాయని చంద్రబాబు విమర్శించారు.
కూటమి ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా 2027 నాటికి రీసర్వే 2.0 ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకి ఇక ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు
శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి భూమిని హక్కుగా కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రైతులు ఇక ఎమ్మార్వో కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండానే ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేలా చూస్తామని ప్రకటన చేశారు.
గురువారం బాపట్ల జిల్లాలోని వేమూరులో పర్యటించిన ఆయన… ‘మీ భూమి- మీహక్కు’ పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రసంగించారు. అంతకంటే ముందు ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు.
రైతులకు ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకాలు
గత పాలకులు రాష్ట్ర విభజన కంటే దారుణంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 2019-24 మధ్య దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కానీ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని పనులు కూడా చేసి చూపిస్తున్నామన్నారు. సుపరిపాలన ఇవ్వాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నామని విరించారు.
“గాడి తప్పిన వ్యవస్థలను సంస్కరించి పారదర్శక పాలనకు నాందిపలికాం. రెవెన్యూ శాఖలో చేసిన విధ్వంసం కారణంగా దానిని పునరుద్ధరించడానికి ఇన్ని నెలలు పట్టింది. ప్రజల ఆస్తులకు భరోసా, ప్రజల జీవితాలకు విశ్వాసం కల్పించాలన్న కారణంగా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. గత పాలకులు మీ భూమిపైనే కన్ను వేసి కట్టడి చేయాలని, బ్లాక్ మెయిల్ చేయాలని ఆలోచన చేశారు. రికార్డులు తారుమారు చేసి, కబ్జాలకు, భూ వివాదాలకు తెరలేపారు. మీ ఆస్తిపై వారు బొమ్మలు వేసుకున్నారు. 2019-24 మధ్య జరిగిన వ్యవహారాల కారణంగా పెద్ద ఎత్తున భూవివాదాలు వచ్చాయి. అందుకే శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి భూమిని హక్కుగా మీకు కల్పించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం” అని సీఎం తెలిపారు.
గత ప్రభుత్వాలపై సీఎం చంద్రబాబు విమర్శలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.


