|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చంద్రహాస్ మూవీ షాకింగ్ కలెక్షన్స్! వడ్డీ కూడా రాలేదా? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

Published: 18-02-2026, 4:05 AM
చంద్రహాస్ మూవీ షాకింగ్ కలెక్షన్స్! వడ్డీ కూడా రాలేదా? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
  • చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ రెండు వారాల క్రితం విడుదలైంది.
  • ఈ సినిమాకి దాదాపు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం.
  • ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీకి వచ్చిన మొత్తం కలెక్షన్లు సుమారు రూ.82 లక్షలు మాత్రమే.
  • కనీసం వడ్డీ డబ్బులు కూడా రాని పరిస్థితి, నిర్మాతలకు భారీ నష్టాలు తప్పేలా లేవు.

యాటిట్యూడ్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చిన చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి.

‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ కలెక్షన్స్ ఎంత?

చంద్రహాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రారంభం నుంచే యాటిట్యూడ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. మీడియాకి ఫోటోలు ఇచ్చే విషయంలోనే యాటిట్యూడ్‌ చూపించాడు. దీంతో దారుణంగా ట్రోల్‌కి గురయ్యాడు. ఆ తర్వాత దాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. పబ్లిసిటీ పరంగా కలిసి వస్తుందని భావించి కంటిన్యూ చేస్తున్నాడు. `రాంనగర్‌ బన్నీ` చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఆయన పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కొంత గ్యాప్‌తో ఇప్పుడు `బరాబర్‌ ప్రేమిస్తా` అనే చిత్రంలో నటించాడు. సంపత్‌ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. మురళీధర్‌ గౌడ్‌, అభయ్‌ నవీన్‌, లక్ష్మణ్‌ కీలక పాత్రలు పోషించారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మించారు.

రెండు వారాల క్రితం ఈ మూవీ విడుదలయ్యింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీని ఆడియెన్స్ పట్టించుకోలేదు. ఆయన చేసిన వివాదమే అందుకు కారణం. `గుంజి గుంజి` అంటూ ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ ఆలపించాడు చంద్రహాస్‌. అందులో కొన్ని వల్గర్‌ పదాలను ఉపయోగించాడు. దీంతో ట్రోల్‌ కి గురయ్యారు. దారుణంగా విమర్శలు ఫేస్‌ చేశాడు. దీనికితోడు నెటిజన్లపై కూడా ఆయన ఫైర్‌ అయ్యాడు. ఇదంతా సినిమాపై గట్టి ప్రభావం పడింది. దీంతో ఎవరూ సినిమాని పట్టించుకోలేదు. వివాదం ప్లస్‌ అవుతుందనుకున్నారు, కానీ అది రివర్స్ అయి, మైనస్ అయ్యింది.

చంద్రహాస్ వివాదాలే సినిమాకు శాపమా?

దీంతో `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. నిజానికి ఓ మోస్తారుగా ఆడాల్సిన మూవీ. కానీ చంద్రహాస్‌ అండ్‌ టీమ్‌ చేసిన అతి గట్టిగా దెబ్బకొట్టింది. ఇక ఈ మూవీ ఆల్మోస్ట్ క్లోజ్‌ అయ్యింది. థియేట్రికల్‌గా ఎత్తేశారు. మరి దీనికి ఎంత పెట్టారు? ఎంత వచ్చిందనేది చూస్తే. సినిమాకి నాలుగు కోట్లు అయ్యిందన్నారు. కానీ రెండు కోట్లలోనే తీశారట. పబ్లిసిటీ వగైరా మూడు కోట్ల వరకు వెళ్లిందని సమాచారం. మరి ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయంటే టోటల్‌గా సుమారు రూ.82లక్షలు వచ్చాయని సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది.  ఇండియా నెట్‌ రూ.70లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. షేర్‌ పరంగా చూస్తే మాత్రం రూ.30-40కోట్ల వరకే ఉంటుందని సమాచారం.

నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవా?

అంటే దారుణమైన కలెక్షన్లుగా చెప్పొచ్చు. ఇవి కనీసం వడ్డీలకు కూడా సరిపోవు. ఫైనల్‌గా చూస్తే ఈ మూవీపై నిర్మాతలకు మొత్తం పోయినట్టే అని చెప్పొచ్చు. అయితే ఓటీటీ రూపంలో కలిసివస్తుందని భావించారు. కానీ ఇప్పటి వరకు ఓటీటీ డీల్‌ కూడా కాలేదు. దీంతో అటు వైపు నుంచి కూడా మైనస్సే. ఇది టోటల్‌ లాస్‌గానే భావిస్తున్నారు ట్రేడ్‌ పండితులు. అదే సమయంలో సినిమాని ఎలా ప్రమోట్‌ చేయకూడదో ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలనేదానికి నిదర్శనంగా ఇది నిలుస్తుందని చెప్పొచ్చు.

చంద్రహాస్ మూవీ కలెక్షన్స్ వివరాలు చూశారుగా. సినిమా ఫలితం ఎలా ఉన్నా, టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.