
📌 Key Points
- రామ్ చరణ్ తన సినీ లైబ్రరీలో ‘పెద్ది’కి మొదటి స్థానం ఇచ్చారు.
- RRR, మగధీరల కంటే ‘పెద్ది’ నా ఫేవరెట్ అని చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- భోపాల్‌లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో ‘హెల్లాళ్లాలో’ సాంగ్ రిలీజ్ చేశారు.
- ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్, రవి కిషన్ పవర్‌ఫుల్ స్పీచ్ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచాయి.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన రాబోయే చిత్రం ‘పెద్ది’ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన సినీ కెరీర్‌లో RRR, మగధీరల కంటే ‘పెద్ది’కే మొదటి స్థానం ఇచ్చానని చెప్పడం, జక్కన్న రాజమౌళి స్పందనపై ఆసక్తి రేపుతోంది.
చరణ్ సంచలన వ్యాఖ్యలు: ‘పెద్ది’కి మొదటి స్థానం
Peddi Release: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి డేట్ లాక్ చేసుకుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా.. రిలీజ్‌కు పది రోజుల ముందే నార్త్ ఇండియాలో సంచలనాలు స్ప్రుష్టిస్తుంది.
చరణ్ కామెంట్స్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్
ఈక్రమంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈరోజు చిత్ర యూనిట్ నిర్వహించిన భారీ ప్రమోషనల్ ఈవెంట్ చూస్తే.. నార్త్ లో చరణ్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయిపోయిందనే చెప్పాలి.అసలు ఇసుక వేస్తే రాలనంతగా వచ్చిన జనం ఒక ఎత్తయితే, ఈ వేదికపై రామ్ చరణ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారాయి.
భోపాల్‌లో ‘పెద్ది’ ప్రమోషన్స్ హోరు
ఈ సినిమా కోసం పడ్డ కష్టం గురించి చెప్తూ.. “నా సినిమా లైబ్రరీలోనే ఈ ‘పెద్ది’ సినిమాకి మొదటి స్థానం ఉంటుంది” అని చరణ్ ఏకంగా పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నా.. నెటిజన్లు మాత్రం క్రేజీగా డిస్కషన్స్ మొదలుపెట్టారు. మరి మనకు ‘మగధీర’, గ్లోబల్ వైడ్‌గా ‘RRR’ లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన జక్కన్న (రాజమౌళి) దీనికి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అంటూ సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టేస్తున్నారు మూవీ లవర్స్.
హెల్లాళ్లాలో’ (Hellallallo) సాంగ్ లాంచ్
ఇక ఈ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌లో ఆస్కార్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ తన బృందంతో కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు.ముఖ్యంగా తెలుగు, హిందీ సూపర్ హిట్ పాటలతో భోపాల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.ఇక అందరూ ఊహించినట్టుగా మోస్ట్ ఎవైటెడ్ ‘హెల్లాళ్లాలో’ (Hellallallo) సాంగ్ ను కూడా ఇక్కడే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.
ఏఆర్ రెహమాన్, రవి కిషన్ ఆకర్షణ
ఈ ఈవెంట్‌కు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు నటుడు రవి కిషన్. ‘రేసు గుర్రం’ సినిమాలో ‘శివారెడ్డి’గా మనల్ని ఎంతగా అలరించాడో తెల్సిందే.అలాంటి ఈ వెర్సటైల్ యాక్టర్ హిందీలో ఇచ్చిన పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ స్పీచ్ నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమా రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
పుష్ప 2 దీటుగా పెద్దిని ల్యాండ్ అవుతాడా?
మొత్తానికి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రీడా నేపథ్య చిత్రంపై భోపాల్ ఈవెంట్ తర్వాత అంచనాలు స్కై హైకి చేరిపోయాయనే చెప్పాలి . ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే.. జూన్ 4న నార్త్ ఇండియాలో రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.చూడాలి మరి పుష్ప 2 దీటుగా పెద్దిని ల్యాండ్ చేయాలని భావిస్తున్న చరణ్ ఆశల్ని పెద్ది తీరుస్తాడో లేదో !
చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ‘పెద్ది’పై అంచనాలను పెంచాయి. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో, రాజమౌళి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

