|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Charmy Kaur: బొద్దుగా ఉండే ఛార్మి.. సడన్‌గా ఇంత మారిపోయింది!

Published: 12-05-2025, 9:24 AM
Charmy Kaur: బొద్దుగా ఉండే ఛార్మి.. సడన్‌గా ఇంత మారిపోయింది!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఛార్మి కౌర్ ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. అయితే, ఇటీవల ఆమె బరువు తగ్గించుకున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

ఛార్మి 9 కేజీల బరువు తగ్గింది.

2

సోషల్ మీడియాలో తన బరువు తగ్గిన విషయాన్ని పంచుకుంది.

4

అభిమానులు ఆమె ప్రయత్నాలను ప్రశంసిస్తున్నారు.

ఛార్మి కౌర్ యొక్క బరువు తగ్గుదల

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఛార్మి కౌర్.  ప్రస్తుతం నిర్మాతగా మారిపోయింది. గతేడాది పూరి జగన్నాధ్‌తో కలిసి డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  మూడు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. నీ తోడు కావాలి అనే మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఛార్మి.. మాస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరమైనా తర్వాత మరింత బొద్దుగా తయారైన ఛార్మి సడన్‌కు అభిమానులకు షాకిచ్చింది. తాను ప్రస్తుతం 9 కేజీల బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరింత బరువు తగ్గుతానని తెలిపింది. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతుందని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సూపర్బ్‌ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఛార్మి ప్రకటన

అభిమానుల స్పందన

మొత్తం మీద, ఛార్మి కౌర్ తన బరువు తగ్గించుకున్న విషయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె కృషికి అభినందనలు తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.