|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చికిరి సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్, కానీ ట్రోలింగ్ తో ఇలా చేశారేంటి.. మరో ట్విస్ట్ ఉంటుందా ?

Published: 07-11-2025, 11:26 PM
చికిరి సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్, కానీ ట్రోలింగ్ తో ఇలా చేశారేంటి.. మరో ట్విస్ట్ ఉంటుందా ?

రాంచరణ్, జాన్వీ కపూర్ ల పెద్ది చిత్రం నుండి విడుదలైన చికిరి సాంగ్ భారీ విజయం సాధించింది. 40 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ పాటపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఏఆర్ రెహమాన్ సంగీతంపై ట్రోలింగ్, తమిళ వెర్షన్ విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

రాంచరణ్-జాన్వీ కపూర్ నటించిన పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ రిలీజ్ అయ్యింది.

2

పాటకు 40 మిలియన్ల వ్యూస్ తో రికార్డు స్పందన లభించగా, రాంచరణ్ డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది.

4

చికిరి తమిళ వెర్షన్ విడుదల కాకపోవడంపై మిస్టరీ కొనసాగుతోంది, రెహమాన్ లైవ్ కన్సర్ట్ ఊహాగానాలున్నాయి.

చికిరి సాంగ్ కు అద్భుతమైన స్పందన

మెగా పవర్ స్టార్ రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ భారీ సిక్సర్ లాగా ఫ్యాన్స్ ని అలరిస్తోంది. టీజర్ ఎలా వైరల్ అయిందో చూశాం. ఇప్పుడు చికిరి సాంగ్ వంతు వచ్చింది. శుక్రవారం రోజు చికిరి సాంగ్ ని రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్లుగా పాట అదిరిపోయింది. రెహమాన్ మ్యూజిక్, రాంచరణ్ డ్యాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్, బుచ్చిబాబు విజువల్స్ ఇలా ప్రతి అంశంలో ప్రేక్షకులని ఈ సాంగ్ థ్రిల్ చేస్తోంది.

ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో చికిరి పాట దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత రాంచరణ్ సోలోగా డ్యాన్స్ లో తన గ్రేస్ చూపిస్తున్నారు. చిరుత, రచ్చ, మగధీర, నాయక్ లాంటి సినిమాల్లో రాంచరణ్ తన డ్యాన్స్ తో ఎలాంటి గ్రేస్ ప్రదర్శించారో ఇప్పుడు చికిరి సాంగ్ లో ఆ వైబ్ ఉందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై రీల్స్ కూడా మొదలయ్యాయి.

ట్రోలింగ్ వెనుక కారణం ఏంటి?

ఇంతలా చికిరి పాట దూసుకుపోతున్నప్పటికీ కొంత నెగిటివిటీ కూడా ఉంది. కొందరు నెటిజన్లు రెహమాన్ సంగీతంలో మునుపటిలా కొత్తదనం లేదని కామెంట్స్ చేస్తున్నారు. రాంచరణ్ డ్యాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్ వల్ల సాంగ్ అప్పీలింగ్ గా ఉంది కానీ.. మ్యూజిక్ పరంగా అంత గొప్పగా లేదని పెదవి విరుస్తున్నారు.

ఓ వైపు ట్రోలింగ్ ఉన్నప్పటికీ వ్యూస్ పరంగా చికిరి సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే మరో విషయంలో చిత్ర యూనిట్ అనుమానాలు పెంచుతోంది. చికిరి సాంగ్ తెలుగు తో పాటు హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలైంది. తమిళ వెర్షన్ ని మాత్రం రిలీజ్ చేయలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని చర్చించుకుంటున్నారు. చిత్ర యూనిట్ మాత్రం తమిళ వర్షన్ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

తమిళ వెర్షన్ మిస్సింగ్: అసలు ట్విస్ట్ ఇదేనా?

తెలుగు, హిందీలో మోహిత్ చౌహాన్.. కన్నడలో సంజిత్ హెగ్డే.. మలయాళంలో బెన్నీ దయాల్ ఈ పాటని పాడారు. తమిళ వెర్షన్ ని మాత్రం ఏఆర్ రెహమాన్ స్వయంగా పాడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళ ఆడియన్స్ కోసం రెహమాన్ లైవ్ కన్సర్ట్ లో ఈ పాటని పాడి వినిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే తమిళ వెర్షన్ రిలీజ్ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో చిత్ర యూనిట్ స్పందించాలి.

చికిరి సాంగ్ రికార్డులు సృష్టిస్తున్నా, ట్రోలింగ్, తమిళ వెర్షన్ మిస్టరీ చిత్ర బృందాన్ని ఆలోచింపజేస్తున్నాయి. దీని వెనుక నిజమైన కారణం ఏమిటో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.