|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరముత్తుకు అవార్డు: కమల్ హాసన్‌పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు! దుమారం రేపుతున్న వివాదం!

Published: 14-03-2026, 12:05 PM
వైరముత్తుకు అవార్డు: కమల్ హాసన్‌పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు! దుమారం రేపుతున్న వివాదం!
  • వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు రావడంపై చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు.
  • లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో వైరముత్తును విమర్శిస్తూ చిన్మయి గతంలోనూ పోస్టులు చేశారు.
  • కమల్ హాసన్, వైరముత్తును అభినందించడంతో చిన్మయి ఆయనపై విమర్శలు గుప్పించారు.
  • రాజకీయాల్లో మహిళల భద్రత గురించి చిన్మయి ఆందోళన వ్యక్తం చేస్తూ ఓటు వేసే మహిళలు ఆలోచించాలని కోరారు.

సింగర్ చిన్మయి వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు రావడంపై తీవ్రంగా స్పందించారు. కమల్ హాసన్, వైరముత్తును ప్రశంసించడంతో ఆయనపై విమర్శలు చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరముత్తుకు జ్ఞానపీఠం: చిన్మయి ఆగ్రహం

Singer chinmayi: సింగర్ చిన్మయి పరిచయం అవసరం లేని పేరు. ఈమె సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈమె వివాదాల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అమ్మాయిలకు సంబంధించిన విషయాలలో చిన్మయి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కారణంగానే వివాదాలలో నిలుస్తున్నారు. ఇప్పటికే ఈమె గురించి ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన గళం వినిపిస్తుంటారు.

ఇకపోతే తాజాగా చిన్మయి తమిళ గేయ రచయిత వైర ముత్తు(vairamuthu) గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనగా మారింది. గతంలో ఈయన తన పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఈమె ఈ విషయంపై వ్యతిరేకత కనబరిచారు .దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ఈమెను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి చిన్మయి సమయం దొరికిన ప్రతిసారి వైర ముత్తు పై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఈయనకు జ్ఞానపీఠ అవార్డు(jnanpith award) రావడంతో తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు ఆయనని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే నటుడు కమల్ హాసన్ (Kamal Hassan)సైతం వైరముత్తు పై ప్రశంసలు కురిపించడంతో సింగర్ చిన్మయి(Chinmayi) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కమల్ హాసన్ పై కూడా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మగవాళ్ళు రాజకీయాలలోకి వచ్చి ఆయన మామ తనను లైంగికంగా వేధించారని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వ్యక్తులు మహిళలకు మద్దతుగా ఉండరని ఓటు వేసే ప్రతి మహిళ గుర్తించుకోవాలి అంటూ చిన్మయి కమల్ హాసన్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కమల్ హాసన్‌పై చిన్మయి విమర్శలు

For God’s sake 🤦🏽‍♀️🤦🏽‍♀️🤦🏽‍♀️🤦🏽‍♀️🤦🏽‍♀️

P.S.: Men in such power in cinema transitioning to politics completely turning a deaf ear to women who come on record to say they were molested by “his uncle-mentor” must remind women who vote – that men will never be on our side.

The weirdest thing -… https://t.co/KB7VNAevu5

రాజకీయాల్లో మహిళల భద్రతపై ఆందోళన

— Chinmayi Sripaada (@Chinmayi) March 14, 2026

ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ కు ఓటు వేసే మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ ఈమె పోస్ట్ వేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక వైరముత్తు అందుకోబోతున్న జ్ఞానపీఠ అవార్డు విషయానికి వస్తే.. మన దేశంలో సాహిత్య రంగంలో అందించే అత్యుత్తమమైన అవార్డు అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని కేవలం ఇద్దరు మాత్రమే అందుకున్నారు. మూడో పురస్కారాన్ని అందుకోబోతున్న వ్యక్తిగా వైరముత్తు నిలిచారు. ఈ నేపథ్యంలోనే తమిళ సినీ రాజకీయ ప్రముఖులు ఈయనకు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేయడంతో సింగర్ చిన్మయి ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

చిన్మయి వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆమె చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. ఈ వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.