
📌 Key Points
- మన శంకరవరప్రసాద్ గారు మూవీ: కలెక్షన్ల సునామీ! 300 కోట్ల గ్రాస్ దాటేసిన మెగా మూవీ!
- చిరంజీవి ఎమోషనల్: ‘మీరు లేకుంటే నేను లేను’ అంటూ అభిమానులకు కృతజ్ఞతలు!
- అనిల్ రావిపూడి దర్శకత్వం: వింటేజ్ చిరంజీవిని మళ్లీ చూపిస్తూ బ్లాక్ బస్టర్ హిట్!
- నయనతార హీరోయిన్: వెంకటేష్ గెస్ట్ రోల్ తో సినిమాకు మరింత క్రేజ్!
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మన శంకరవరప్రసాద్ గారు భారీ విజయం సాధించడంతో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆయన అభిమానుల ప్రేమను కొనియాడారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.
చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ వెనుక అసలు కథేంటి?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో, నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలో డ్యాన్సులు, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నిట్లో వింటేజ్ చిరంజీవిని చూపించడంతో ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.(Chiranjeevi)
ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు సినిమా 300 కోట్ల గ్రాస్ దాటేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా ఇంత భారీ విజయం సాధించడంతో చిరంజీవి కృతజ్ఞతతో ఎమోషనల్ ట్వీట్ చేసారు.
300 కోట్ల క్లబ్ లో మన శంకరవరప్రసాద్ గారు సినిమా!
చిరంజీవి తన ట్వీట్ లో.. మన శంకరవరప్రసాద్ గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది.
ఫ్యాన్స్ పై చిరంజీవి ప్రేమకు ఇదే నిదర్శనం!
వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి – పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు & సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో… లవ్ యూ ఆల్.. మీ చిరంజీవి అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసారు. దీంతో ఫ్యాన్స్ చిరంజీవి ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.
చిరంజీవి గారి మన శంకరవరప్రసాద్ గారు చిత్రం భారీ విజయం సాధించింది. ఆయన అభిమానుల ప్రేమకు ఎమోషనల్ గా స్పందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


