|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

14 ఏళ్ల తర్వాత భార్య కోసం చిరు సంచలన నిర్ణయం! పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?

Updated: 27-01-2026, 12:10 AM
మెగా షాక్: 14 ఏళ్ల తర్వాత భార్య కోసం చిరు సంచలన నిర్ణయం! పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?
  • 14 ఏళ్ల తర్వాత భార్య సురేఖకు చిరంజీవి ఇచ్చిన మాట నెరవేర్చారు!
  • ఖైదీ నెంబర్ 150 చిత్రానికి సురేఖ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.
  • పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే సురేఖ కోరిక నెరవేరుతుందా?
  • వి.వి. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి రీఎంట్రీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్!

మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక సంచలన వార్త! ఆయన తన సతీమణి సురేఖకు ఎప్పుడో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే షాక్ అవుతారు! ఈ సినిమా అప్డేట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి భార్యకు ఇచ్చిన మాట ఇదే!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉన్నాయి. గొప్ప విజయాలు కూడా ఉన్నాయి. చిరంజీవి సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తన సతీమణి సురేఖకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

ఠాగూర్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి.. వివి వినాయక్ తో ఇలా అన్నారట. మీ వదిన సురేఖ చాలా కాలంగా తన నిర్మాణంలో ఒక సినిమా చేయమని అడుగుతోంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని కూడా అడుగుతోంది. మేమిద్దరం కలిసి నటించే కథ దొరకడం కష్టం. కాబట్టి విడివిడిగా అయినా ఆ సినిమాలు నువ్వే చేయాలి అని చిరంజీవి అన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాపై దర్శకుడు ఏమన్నారంటే?

తధాస్తు దేవతలు తధాస్తు అన్నట్లు అప్పుడు చిరంజీవి గారు చెప్పిన మాట ఖైదీ నెంబర్ 150తో నెరవేరింది. ఆ చిత్రానికి సురేఖ గారే నిర్మాత. ఈ చిత్రానికి ఆమె సమర్పకురాలిగా ఉన్నారు. చిరంజీవి గారు రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆ అవకాశం నాకే దక్కింది. చిరంజీవి గారు ఒకరోజు నన్ను పిలిచి వినాయక్.. కత్తి సినిమా చూశావా అని అడిగారు. లేదు అన్నయ్య అని చెప్పా. ఒకసారి నన్ను ఆ మూవీలో ఊహించుకుని సినిమా చూడు ఆ తర్వాత నీ అభిప్రాయం చెప్పు అని అన్నారు.

ఆ టైంలో నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకుండా చూస్తే రాంగ్ డెసిషన్స్ వస్తాయి అని.. 10 రోజుల తర్వాత చూస్తాను అని చిరంజీవి గారికి చెప్పా. ఆయన నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే చూడు అన్నారు. ఒకరోజు కత్తి మూవీ పెట్టుకుని చూడడం ప్రారంభించాను. చిరంజీవి గారికి ఈ మూవీ అదిరిపోతుంది. షూర్ షాట్ హిట్ అంతే. కాకపోతే కామెడీ, పాటలు తక్కువ అయ్యాయి. వాటిపై వర్క్ చేయాలి అని చిరంజీవి గారికి చెప్పా. ఆయన ఒకే అన్నారు. అంతా రెడీ చేసి స్క్రిప్ట్ చెబితే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఒకే అయింది. ముందుగా అనుష్క, కాజల్ ఇద్దరు హీరోయిన్లు ఉండాలని అనుకున్నాం. చివరికి కాజల్ ఒక్కరే ఉంటే సరిపోతుంది అనిపించింది.

ఖైదీ నెంబర్ 150 వెనుక అసలు కథ!

స్క్రిప్ట్ అంతా ఒకే అయ్యాక ఇందులో బ్రహ్మానందం కి ఏమైనా ఛాన్స్ ఉందా అని చిరంజీవి గారు అడిగారు. దీనితో ఒక ఎపిసోడ్ లేపేసి బ్రహ్మానందం క్యారెక్టర్ సెట్ చేశాం అని వినాయక్ తెలిపారు. ఖైదీ నెంబర్ 150 చిత్రం విడుదలై రికార్డులు తిరగరాసింది. ఆ విధంగా చిరంజీవి 14 ఏళ్ళ తర్వాత తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తన వదిన కోసం ఇంకా మూవీ చేయలేదు.

చిరంజీవి తన భార్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అభిమానులను ఆనందపరిచింది. పవన్ కళ్యాణ్ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.