|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు సినిమాకు కోర్టు షాక్: 45 కోట్ల లెక్క తేల్చాల్సిందే!

Published: 23-01-2026, 8:35 AM
చిరు సినిమాకు కోర్టు షాక్: 45 కోట్ల లెక్క తేల్చాల్సిందే!
  • చిరంజీవి సినిమా టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు సీరియస్.
  • టికెట్ల ధరలు పెంచడం ద్వారా 45 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని పిటిషన్ దాఖలు.
  • 45 కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశం.
  • తెలంగాణ, ఏపీలో టికెట్ల ధరలు పెరగడం, రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమా.

చిరంజీవి హీరోగా నటించిన సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. టికెట్ల ధరలు పెంచడం ద్వారా 45 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని ఆరోపణలు రావడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

MSVPG Film: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడం మన శంకర వరప్రసాద్ గారు (MSVPG)సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సినిమాలకు టికెట్లు రేట్లు పెంచకూడదన్నప్పటికీ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 11వ తేదీ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్లకు 600 రూపాయలు టికెట్ల రేట్లు నిర్ణయించారు. అలాగే 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పెంచిన టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ. 50, మల్టీప్లెక్స్ లకు రూ.100 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఈ సినిమా టికెట్ల ధరలను అక్రమంగా పెంచారని ఇలా అక్రమంగా పెంచడం ద్వారా సుమారు 45 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారు అంటూ శ్రీనివాసరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ నేడు జరిగింది. ఈ విచారణలో భాగంగా కోర్ట్ ఊహించని తీర్పు వెల్లడించింది. చట్ట విరుద్ధంగా సినిమా టికెట్లు రేట్లు పెంచడం వల్ల వచ్చిన 45 కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని జిఎస్టి అధికారులకు కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

45 కోట్ల రూపాయల అక్రమ వసూళ్ల ఆరోపణలు

ఇలా రూ. 45 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కల వివరాలు చెప్పాలని తీర్పు వెల్లడించడంతో చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది. ఈ విషయంలో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలియాల్సి ఉంది. ఇక మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీలో కూడా టికెట్లు ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇలా పెరిగిన టికెట్లు ధరలు ఏపీలో 10 రోజులు పాటు అందుబాటులో ఉన్నాయి ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన ఆదరణ రాబడుతుంది.

రికార్డు స్థాయిలో కలెక్షన్స్..

లెక్కలు సమర్పించాలని కోర్టు ఆదేశం

ఇప్పటివరకు ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా నటించగా, విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు ఇప్పటికీ థియేటర్లలో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

ఈ తీర్పు చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సమర్పించే లెక్కలపై అందరి దృష్టి నెలకొంది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.