|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి ఇంట డబుల్ ధమాకా! వారసుడి రాకతో ఆనందంలో మునిగిపోయిన మెగాస్టార్!

Published: 01-02-2026, 3:35 AM
చిరంజీవి ఇంట డబుల్ ధమాకా! వారసుడి రాకతో ఆనందంలో మునిగిపోయిన మెగాస్టార్!
  • మెగా కుటుంబంలోకి కవల పిల్లలు – ఒక అమ్మాయి, ఒక అబ్బాయి రాకతో ఆనందం వెల్లివిరిసింది.
  • చిరంజీవి మనవడు, మనవరాలు రావడంతో సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నారు.
  • ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ ప్రముఖులు, అభిమానులు.
  • కుమార్తెతో పాటు కుమారుడు కూడా జన్మించడంతో మెగా వంశం నిలబడుతుందని అభిమానుల ఆనందం.

మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్లి తర్వాత ఎట్టకేలకు వారసులు వచ్చారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఒక పాప, ఒక బాబు పుట్టడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

మెగా కుటుంబంలో కవలల సందడి

Chiranjeevi: మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది గత కొంతకాలంగా మెగా వారసుడు కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే గత రాత్రి ఉపాసన(Upasana) పండంటి ఆడపిల్ల (Baby Girl)అలాగే మగ బిడ్డకు(Baby Boy) జన్మనివ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలో మెగా మెగాసిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ మెగా లెగిసి అలాగే కొనసాగాలి అంటే రామ్ చరణ్ కు కొడుకు పుడితే బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు. ఇక చిరంజీవి సైతం ఇదే విషయం గురించి బహిరంగంగా తెలియజేశారు. ఇకపోతే ఉపాసన రాంచరణ్ దంపతులకు మొదటి సంతానంలో కుమార్తె జన్మించడంతో వారసుడు వస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావించారు.

ఇక ఉపాసన తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించడమే కాకుండా ఈసారి కవల పిల్లల జన్మించబోతున్నారని చెప్పడంతో మెగా అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. ఇక గత రాత్రి ఉపాసన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో కవల పిల్లలకు జన్మనిచ్చారు అయితే ఒకరు అమ్మాయి మరొకరు అబ్బాయి కావటం విశేషం. ఇలా వారసుడు రావడంతో అభిమానులు అపోలో హాస్పిటల్ లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. గత రాత్రి మెగా కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ చేరుకున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి సంతోషం.. అభిమానుల ఆనందం

ఇకపోతే తాజాగా చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎంతోమంది మా ఇంట్లో ఈ శుభం జరగాలని కోరుకుంటున్నారు మీ అందరి ఆశీర్వాదంతో ఉపాసన పండంటి ఆడబిడ్డ అలాగే మగ బిడ్డకు జన్మనిచ్చారని ప్రస్తుతం తల్లి బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఆ హనుమాన్ ఆశీస్సులతో ఈరోజు మా ఇంట శుభం జరిగిందని ఈ సంతోషాన్ని మాటలలో వర్ణించలేకపోతున్నాను అంటూ చిరంజీవి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఉపాసనకు సర్జరీ చేసిన డాక్టర్లకు అపోలో హాస్పిటల్ వైద్య బృందానికి ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు.

వారసుడిని పరిచయం చేస్తారా?

వారసులను ఆశీర్వదిస్తున్న ప్రముఖులు

ఇలా తన కొడుకుకి తిరిగి కొడుకు పుట్టడంతో చిరంజీవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది. ఈ విధంగా రామ్ చరణ్ కు తిరిగి కొడుకు అలాగే కూతురు జన్మించడంతో మెగా అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అందరూ కూడా స్పందిస్తూ రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి మెగా వారసుడు ఎలా ఉండబోతున్నారనే విషయాన్ని తెలుసుకోవడం కోసం అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇప్పటివరకు తమ పెద్ద కుమార్తె క్లినిక్ కారా ఎలా ఉంటుంది? ఏంటి అనే విషయాలను కూడా అభిమానులకు చూపించలేదు. మరి వారసుడినైనా అభిమానులకు పరిచయం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మెగా కుటుంబంలోకి వచ్చిన ఈ కొత్త సభ్యులతో ఆనందం వెల్లివిరుస్తోంది. రామ్ చరణ్, ఉపాసనలకు అభిమానులందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా వంశం ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.