
నాగచైతన్య, సమంత నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాకు ఓ ఆసక్తికరమైన వెనుక చరిత్ర ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి నటించాల్సి ఉండేదని, కానీ ఆయన రిజెక్ట్ చేశారని తెలిసింది.
Key Points
‘ఏ మాయ చేసావే’ సినిమా క్లైమాక్స్ చిరంజీవితో మరోలా ఉండేది.
చిరంజీవి డైరెక్టర్ గా, హీరోను పెళ్లికి తీసుకెళ్లే కథాంశం.
చిరంజీవి యాక్షన్ సినిమా అంచనాలను నివారించాలని నిర్ణయించుకున్నారు.
చిరంజీవి రోల్ రిజెక్షన్
Ye Maya Chesave : నాగచైతన్య – సమంత కాంబోలో ఫస్ట్ వచ్చిన సినిమా ‘ఏ మాయ చేసావే’. ఇది మంచి హిట్ అవ్వడమే కాక ఫ్యాన్స్ కి స్పెషల్ సినిమాలా మిగిలింది. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో తెరకెక్కించారు. రెండు భాషల్లో క్లైమాక్స్ కొంచెం ఛేంజ్ ఉంటుంది. అయితే తెలుగులో మరో క్లైమాక్స్ కూడా అనుకున్నాడట డైరెక్టర్ గౌతమ్ మీనన్.
తాజాగా గౌతమ్ మీనన్ ఒక ఇంటర్వ్యూలో ఏ మాయ చేసావే సినిమా గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
మార్పు చెందిన క్లైమాక్స్
గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏ మాయ చేసావే సినిమా మొదట మహేష్ బాబుతో అనుకున్నాను. అది కుదరలేదు. ఆ సినిమా క్లైమాక్స్ కోసం చిరంజీవిని తీసుకురావాలనుకున్నాను. క్లైమాక్స్ లో హీరో చిరంజీవి సినిమా డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ పెళ్లి వేరేవాళ్లతో జరుగుతుందని తెలిసి చిరంజీవి హీరోని హెలికాఫ్టర్ లో ఎక్కించుకొని పెళ్లి దగ్గరకు తీసుకెళ్లి హీరో – హీరోయిన్ ని కలుపుతాడు అని రాసుకున్నాను. చిరంజీవి గారిని కలిసి కథ కూడా చెప్పాను. కానీ ఆయన రిజెక్ట్ చేసారు. మనిద్దరం కలిసి సినిమా చేస్తే ఆడియన్స్ యాక్షన్ సినిమా ఊహిస్తారు అని చెప్పి రిజెక్ట్ చేసారు అని తెలిపాడు.
గౌతమ్ మీనన్ వివరణ
చిరంజీవి ‘ఏ మాయ చేసావే’ సినిమాలో నటించకపోవడం వల్ల సినిమా క్లైమాక్స్ మరోలా ఉండేది. ఆయన నిర్ణయం సినిమాకు భిన్నమైన రూపునిచ్చింది.


