|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chiranjeevi – RGV : శివ రీ రిలీజ్ పై చిరంజీవి కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ..

Published: 09-11-2025, 2:45 AM
Chiranjeevi – RGV : శివ రీ రిలీజ్ పై చిరంజీవి కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ..

నాగార్జున కల్ట్ క్లాసిక్ ‘శివ’ రీ రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సినిమా విజన్‌ను, వర్మ దర్శకత్వాన్ని కొనియాడారు. ఈ క్రమంలో, గతంలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు ఆర్జీవీ క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

నాగార్జున 'శివ' సినిమా 35 ఏళ్ల తర్వాత నవంబర్ 14న రీ రిలీజ్ అవుతోంది.

2

మెగాస్టార్ చిరంజీవి 'శివ' సినిమాను ట్రెండ్ సెట్టర్‌గా అభివర్ణించి, ఆర్జీవీ విజన్‌ను కొనియాడారు.

4

చిరంజీవి గొప్ప మనసును ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.

శివ రీ రిలీజ్‌కు ఘన స్వాగతం

Chiranjeevi – RGV : ఆర్జీవీ మొదటి సినిమా, నాగార్జున కెరీర్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సూపర్ హిట్ సినిమా ‘శివ’. 1990 లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సాంకేతికంగా కూడా ఈ సినిమా అందర్నీ మెప్పించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. శివ సినిమా 35 ఏళ్ళ తర్వాత ఇపుడు రీ రిలీజ్ అవుతుంది. శివ సినిమా నవంబర్ 14న రీ రిలీజ్ కానుంది.(Chiranjeevi – RGV)

శివ రీ రిలీజ్ సందర్భంగా చాలా మంది హీరోలు, దర్శక నిర్మాతలు ఈ సినిమా గురించి మాట్లాడుతూ వీడియోలు రిలీజ్ చేసారు. శివ సినిమాతో తమకు ఉన్న అనుబంధం తెలిపారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా శివ సినిమా గురించి మాట్లాడుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు.

చిరంజీవి ప్రశంసలు – శివ ఒక ట్రెండ్ సెట్టర్

చిరంజీవి శివ సినిమా గురించి మాట్లాడుతూ.. శివ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు ఒక కొత్త నిర్వచనం. కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ. ఇప్పటికి మర్చిపోలేను కల్ట్ షాట్ నాగార్జున సైకిల్ చైన్ లాగడం. నాగార్జున నటనలోని తీవ్రత, ఆ చూపులో తీక్షత, సినిమాలోని నటీనటులు అందరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడం సంతోషంగా అంది. ఇప్పటి యువత ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అప్పట్లోనే ఇది ఒక కాంటెంపరరీ ఫీలింగా ఎలా తీసారు అని నేర్చుకోవాలి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ విజన్, అతని సౌండ్ టెక్నీక్స్, కెమెరా షాట్స్ అన్ని కొత్తగా అనిపించాయి. ఆ రోజే ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అనిపించింది. తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ సినిమా చిరంజీవి లా చిరస్థాయిలో ఉంటుంది అని అన్నారు.

ఆర్జీవీ క్షమాపణలు – అభిమానుల అభినందనలు

ఈ వీడియోని ఆర్జీవీ షేర్ చేసి.. థ్యాంక్యూ చిరంజీవి గారు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు. గతంలో ఆర్జీవీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై పలు అనుచిత వ్యాఖ్యలతో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ ఎన్ని విమర్శలు చేసినా చిరంజీవి ఇప్పుడు శివ రీ రిలీజ్ కి సపోర్టుగా నిలబడటంతో ఆర్జీవీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో చిరంజీవిని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.

చిరంజీవి గొప్ప మనసును, ఆయన సినిమాపై చూపిన ప్రేమను అభిమానులు అభినందిస్తున్నారు. ఈ పరిణామం తెలుగు సినీ పరిశ్రమలో సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ‘శివ’ రీ రిలీజ్ మరింత విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.