|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ పై వర్మ షాకింగ్ కామెంట్స్! చరణ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు.. వైరల్ న్యూస్!

Published: 10-04-2026, 6:35 AM
మెగాస్టార్ పై వర్మ షాకింగ్ కామెంట్స్! చరణ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు.. వైరల్ న్యూస్!
  • చిరంజీవి నటన, డ్యాన్స్, ఫైట్స్ అంటే ఫ్యాషన్ అంటున్న వర్మ.. మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు!
  • రాంచరణ్ రియల్ లైఫ్ లో చాలా బోరింగ్.. కారణం అతని మెంటాలిటీ అంటున్న రాంగోపాల్ వర్మ.
  • చిరంజీవి గారు సినిమా తప్ప వేరే రంగంలో బిగ్ ఫెయిల్యూర్ అయ్యేవారు: వర్మ షాకింగ్ కామెంట్స్!
  • గతంలో చిరంజీవి, వర్మ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి కారణం బాలీవుడ్ కమిట్మెంట్స్ అని వర్మ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ గురించి కూడా కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

చిరంజీవి గురించి వర్మ సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి టాలీవుడ్ లో నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. చిరంజీవిని విమర్శించే వారు కూడా ఉన్నారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అయితే తరచుగా చిరంజీవిపై సెటైరికల్ కామెంట్స్ చేస్తుంటారు.

కొన్నిసార్లు చిరంజీవి గురించి తనకు అనిపించినా వ్యాఖ్యలు చేస్తుంటారు. చిరంజీవిని అందరూ కష్టపడి ఎదిగారు అని అంటుంటారు. కానీ నా దృష్టిలో ఆయన కష్టపడలేదు. ఫ్యాషన్ తో నటుడిగా ఎదిగారు. నటించడం, డ్యాన్సులు చేయడం, ఫైట్స్ చేయడం ఆయనకు ఫ్యాషన్. ప్రేక్షకులకు నచ్చేలా చేయాలనేది ఆయన కోరిక. ఆ పనిని ఆయన ఇష్టపడి చేశారు. అందుకే నెంబర్ 1 అయ్యారు అని వర్మ తెలిపారు.

రాంచరణ్ పై వర్మ షాకింగ్ కామెంట్స్

మరో ఇంటర్వ్యూలో వర్మ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారికి ఆల్టర్ నేట్ కెరీర్ ఏది ఉంటే బావుంటుంది అని యాంకర్ ప్రశ్నించారు. వర్మ బదులిస్తూ.. చిరంజీవి గారు సినిమా తప్ప వేరే ఏ రంగంలో ఉన్నా బిగ్ ఫెయిల్యూర్ అయ్యేవారు. ఎందుకంటే దానికి కారణం ఆయన మెంటాలిటీనే.

చిరంజీవి గారి సాఫ్ట్ నేచర్ ఇక ఏ రంగంలోనూ పనికిరాదు అని వర్మ అన్నారు. రాంచరణ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంచరణ్ పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్. రియల్ లైఫ్ లో రాంచరణ్ చాలా బోరింగ్ పర్సన్. దానికి కారణం రాంచరణ్ మెంటాలిటీనే. రాంచరణ్ సైలెంట్ గా ఉండే వ్యక్తి అని వర్మ తెలిపారు.

చిరంజీవి, వర్మ సినిమా ఎందుకు ఆగిపోయింది?

గతంలో వర్మ, చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయింది. కానీ ఆ మూవీ పూర్తి కాలేదు. షూటింగ్ దశలోనే ఆగిపోయింది. దానికి కారణం తానే అని, బాలీవుడ్ లో కమిట్మెంట్స్ ఉండడం వల్ల చిరంజీవి సినిమాపై ఫోకస్ చేయలేదు అని వర్మ సారీ కూడా చెప్పారు.

రాంగోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.