|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి నో చెప్పడానికి కారణమిదేనా? గుణశేఖర్ ‘యుఫోరియా’ వెనుక అసలు కథ!

Published: 11-02-2026, 6:05 AM
చిరంజీవి నో చెప్పడానికి కారణమిదేనా? గుణశేఖర్ 'యుఫోరియా' వెనుక అసలు కథ!
  • గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’ సినిమా ఫిబ్రవరి 6న విడుదలైంది.
  • సినిమాలో జయదేవ్ పాత్ర కోసం మొదట చిరంజీవిని అనుకున్నారట.
  • చిరంజీవిని క్యామియో పాత్రకు పరిమితం చేయడం ఇష్టం లేక గౌతమ్ మీనన్ ను తీసుకున్నామని గుణశేఖర్ తెలిపారు.
  • సారా అర్జున్ వరుస విజయాలతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘యుఫోరియా’ సినిమాలో మొదట చిరంజీవి నటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమాను వదులుకున్నారు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ ఆ పాత్రను పోషించారు. దీని గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

యుఫోరియా సినిమాలో గౌతమ్ మీనన్ పాత్ర

Euphoria: గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక చావ్లా, సారా అర్జున్, విఘ్నేష్ గవిరెడ్డి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం యుఫోరియా(Euphoria). ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో కొనసాగుతుందని డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారనే అంశాలను చాలా చక్కగా చూపించారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో స్టార్ నటీనటులు భాగమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్ కూడా కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ సిటీ పోలీస్ కమిషనర్ జయదేవ్ పాత్రలో నటించి తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ పాత్ర కూడా ఎంతో కీలకంగా మారిందని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్ ఈ సినిమాలో గౌతమ్ మీనన్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముందుగా జయదేవ్ పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని అనుకున్నారట. ఈ స్టోరీ విన్న చిరంజీవి కూడా ఈ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారని గుణశేఖర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారిని మా సినిమాలో క్యామియో పాత్రకు పరిమితం చేయటం ఇష్టంలేకనే తిరిగి గౌతమ్ మీనన్ ను తీసుకున్నామంటూ ఈ సందర్భంగా గుణశేఖర్ తెలియచేశారు. ఇలా చిరంజీవి పాత్ర గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ వ్యాఖ్యలపై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవిని ఎందుకు వద్దనుకున్నారో తెలిపిన గుణశేఖర్

ఇక ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించగా ఈయన కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించారు. బాలీవుడ్ నటి సారా అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా సారా అర్జున్ మంచి సక్సెస్ అందుకొని కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. దురంధర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సారా అర్జున్ యుఫోరియా సినిమా ద్వారా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ద్వారా మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.

సినిమాలను తగ్గించిన గుణశేఖర్..

సారా అర్జున్ సక్సెస్ వెనుక కథ

ఇక గుణశేఖర్ ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల ఈయన సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి. గుణశేఖర్ చివరిగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం ఈయన యుఫోరియా అంటూ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

‘యుఫోరియా’ సినిమాతో సారా అర్జున్ మంచి విజయాన్ని అందుకున్నారు. గుణశేఖర్ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన సినిమాలను ఎందుకు తగ్గించారో కూడా తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.