|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ చిరంజీవి సంచలనం! రామ్ చరణ్ న్యూ ఏజ్ మెగాస్టార్ – వైరల్ స్టేట్‌మెంట్!

Published: 23-06-2026, 11:58 PM
మెగాస్టార్ చిరంజీవి సంచలనం! రామ్ చరణ్ న్యూ ఏజ్ మెగాస్టార్ - వైరల్ స్టేట్‌మెంట్!
  • మెగాస్టార్ చిరంజీవి నుండి రామ్ చరణ్‌కు ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ పట్టా, ట్రెండింగ్ వార్త.
  • ‘పెద్ది’ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో తండ్రి చిరంజీవి భావోద్వేగ ప్రకటన, అభిమానుల్లో ఉత్సాహం.
  • చరణ్ నటన ‘రంగస్థలం’ను మించిపోయిందని చిరంజీవి వ్యాఖ్య, రికార్డుల వేట.
  • ‘పెద్ది’ పాత్ర కోసం రామ్ చరణ్ కఠోర శ్రమ, జిమ్ వర్కౌట్స్‌పై చిరు ప్రశంసలు.

మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటనతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది! తనయుడు రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘పెద్ది’ సినిమా విజయ సంబరాల్లో చిరు మాటలు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి.

చరణే ‘న్యూ ఏజ్‌ మెగాస్టార్‌’: చిరంజీవి సంచలన ప్రకటన!

రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌ అని వెల్లడించారు చిరంజీవి. ఇటీవల నేషనల్‌ మీడియా నిర్వహించిన కాంక్లెవ్‌లో మోడీతోపాటు రామ్‌ చరణ్‌ పాల్గొన్నాడని, ఆ సందర్భంగా అంతా చరణ్‌ని కాబోయే మెగాస్టార్‌ అంటూ ప్రశంసలు కురిపించారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ని న్యూ ఏజ్‌ మెగాస్టార్‌ అంటూ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇకపై రామ్‌ చరణ్‌ తన ముందు ఉంటాడని, అతని వెనకాలే తాను ఉంటానని చెప్పాడు చిరంజీవి. పుత్రుడు గొప్ప వాడు అయినప్పుడు కలిగే పుత్రోత్సహంతో చెబుతున్నానని వెల్లడించారు. `పెద్ది` మూవీ విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. ఈ క్రమంలో సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. దీనికి చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ నటనపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చూస్తుంటే, పెద్ది మాత్రమే కనిపించాడని, చరణ్‌ ఎక్కడా కనిపించలేదని, సినిమా చూస్తున్నంత సేపు పెద్ది పాత్రతో ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయామని, అంతగా ఇన్‌వాల్వ్ అయ్యేలా చరణ్‌ తన నటనని ప్రదర్శించాడని తెలిపారు. సినిమా కోసం చరణ్‌ ఎంతో కష్టపడ్డాడని వెల్లడించాడు. ఉదయం, సాయంత్రం జిమ్‌లో శ్రమించినట్టు తెలిపారు. షూటింగ్‌ కి వెళ్లి వచ్చాక కూడా సాయంత్రం జిమ్‌లో చెమటోడ్చాడని, ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకొని మళ్లీ గంట సేపు ఎక్సర్‌సైజ్‌లు చేసేవాడని తెలిపారు. ఆసమయంలో ఎందుకు నాన్న అంత కష్టపడుతున్నావని అడిగితే, అలా చేస్తేనే రేపు షూటింగ్‌లో ఎనర్జిటిక్‌గా ఉండగలమని చెప్పేవాడు, పాత్ర కోసం కఠోర శ్రమ చేశాడని చెప్పాడు చిరంజీవి.

‘పెద్ది’ కోసం చరణ్‌ కఠోర శ్రమ: మెగాస్టార్ ప్రశంసలు!

రామ్‌ చరణ్‌ నటన పరంగా `రంగస్థలం`లో అద్భుతంగా నటించాడు, కానీ దాన్ని మించి `పెద్ది`లో నటించాడని, ఇందులో ఒక పరిపూర్ణమైన నటనని కనబరిచాడని, ఆ విషయంలో చరణ్‌ ని చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని చెప్పారు. “రంగస్థలం`లో చరణ్‌ అద్భుతంగా చేశాడు, కానీ మళ్లీ అలాంటి సినిమాలు చేయాలంటే ఇంకా ఎన్నేళ్లు పడుతుందో అనుకున్నాను, ఎందుకంటే చాలా సినిమాలు వస్తుంటాయి, అలరిస్తుంటాయి, కానీ కొన్ని మాత్రమే గుర్తిండిపోతాయి. అలాంటి వాటిలో రాజమౌళి రూపొందించిన `మగధీర`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, మళ్లీ ఇంత త్వరగా `పెద్ది` లాంటి సినిమా వస్తుందని ఊహించలేదు, ఆ రకంగా రామ్‌ చరణ్‌ చేసుకున్న అదృష్టం ఈ మూవీ. పెద్ది పాత్రని అవపోసన పట్టాడు, దాన్ని అంతగా నమ్మాడు, కాబట్టి అంత బాగా నటించగలిగాడు. పాత్రని, దర్శకుడిని, కథని నమ్మకపోతే, ఇంతటి కఠోర శ్రమ చేయకపోతే ఇందులో సక్సెస్‌ అయ్యేవాడు కాదు, మీ ప్రశంసలు పొందేవాడు కాదు` అని తెలిపారు చిరంజీవి.

ఈ సందర్భంగా చిరంజీవి ఇంకా మాట్లాడుతూ, ఆర్టిస్ట్ లు అనేవాళ్లు పాత్రలోని ఎమోషన్‌ని ఫీల్‌ అవ్వాలి తప్ప, ముఖకవలికలతోటి, మజిల్స్ తో రాణించాలనేది పర్‌ఫెక్ట్ యాక్టింగ్‌ కాదు, చాలా మంది గొప్ప యాక్టర్లు ఉంటారు, తెరపై వాళ్లు బాధపడుతూ, మనల్ని బాధపెడుతుంటారు, కానీ పాత్రలోని ఎమోషన్‌ని తాను ఫీలవుతూ, ఆ ఎమోషన్స్ ని కళ్లద్వారానే చూపిస్తూ, మనల్ని కంటతడి పెట్టించేలా చేశారే, అది పరిపూర్ణమైన యాక్టింగ్‌. పరిపక్వత ఉన్న నటన. ఈ రోజు రామ్‌ చరణ్‌లో ఆ పరిపక్వత కలిగిన నటనని నేను చూసేలా చేశాడని చెప్పారు చిరంజీవి.

‘రంగస్థలం’ మించిపోయింది: నటనపై చిరు వ్యాఖ్యలు!

ఇక జాతీయ అవార్డుల గురించి చెబుతూ, పెద్దిలో రామ్‌ చరణ్‌ నటని చూసి అంతా అవార్డ్ విన్నింగ్‌ పర్‌ఫెర్మెన్స్ అంటున్నారు. అవార్డులు వస్తే రావచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు అవార్డు విన్నింగ్‌ యాక్టింగ్‌ అంటుంటే చాలా గర్వంగా ఉంది. `రంగస్థలం` సమయంలో ఇది అవార్డు విన్నింగ్‌ పర్ఫర్మెన్స్, చరణ్ అంత అద్భుతంగా చేశాడని సుకుమార్‌ తనతో చాలా సార్లు చెప్పాడని, అలాంటి ప్రశంసలు వచ్చాయంటే దాన్ని మించిన అవార్డు మరోటి ఉండదని తాను ప్రగాఢంగా నమ్ముతానని తెలిపారు చిరు. ఇప్పుడు `పెద్ది`కి అలాంటి ప్రశంసలు రావడం గర్వంగా ఉందని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు మెగాస్టార్. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

‘పెద్ది’తో రామ్ చరణ్ నటన సరికొత్త శిఖరాలను అధిరోహించిందని చిరంజీవి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మెగా కాంబో భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికర అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.