|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ విధ్వంసం! 41 రోజుల్లో ఊహించని రికార్డులు! ఓటీటీలోనూ తగ్గేదే లే!!

Published: 22-02-2026, 2:35 AM
చిరు 'మన శంకర వర ప్రసాద్‌ గారు' విధ్వంసం! 41 రోజుల్లో ఊహించని రికార్డులు! ఓటీటీలోనూ తగ్గేదే లే!!
  • మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ మూవీ 41 రోజుల్లో రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది! సంచలనం!
  • ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా థియేటర్లలో ఇంకా డీసెంట్ కలెక్షన్లు రాబడుతున్న ఏకైక సినిమా ఇది ఒక్కటే!
  • జీ 5 ఓటీటీలో విడుదలైన 24 గంటల్లోనే 200 మిలియన్ నిమిషాల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది మన శంకర వర ప్రసాద్‌ గారు!
  • ఈ నెల 28న జీ తెలుగులో సాయంత్రం 5.30 గంటలకు ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ టెలికాస్ట్ కానుంది! టీవీలో రికార్డులు షురూ!!

మెగాస్టార్ చిరంజీవి తన సత్తా చాటారు! ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఓటీటీలో కూడా రికార్డులు కొల్లగొడుతోంది.

41 రోజుల్లో 300 కోట్ల వసూళ్లు! ఇది మామూలు రికార్డు కాదు!

మెగాస్టార్‌ చిరంజీవికి చాలా రోజుల తర్వాత తన రేంజ్‌కి తగ్గ హిట్‌ పడింది. ఈ సంక్రాంతికి ఆయన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏకంగా తెలుగులో రీజనల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.  సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు 41రోజులు పూర్తి చేసుకుంది. ఓ వైపు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నా, థియేటర్లలో రన్‌ అవుతుంది. డీసెంట్‌ కలెక్షన్లని వసూలు చేస్తోంది.

విడుదలై 41 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీని అరుదైన మైల్‌ స్టోన్‌ కి చేరింది. ప్రముఖ కలెక్షన్ల సైట్‌ `సాక్నిల్క్` లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఇది రూ.300కోట్ల వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా  మూడు వందల క్లబ్‌లో చేరడం విశేషం. పాన్‌ ఇండియా మూవీస్‌ కాకుండా ఈ స్థాయి వసూళ్లని రాబట్టిన తొలి సినిమాగా `మన శంకర వర ప్రసాద్‌ గారు` రికార్డు సృష్టించింది. అరుదైన మైల్‌ స్టోన్‌ని టచ్‌ చేసిందని చెప్పొచ్చు.

ఓటీటీలో కూడా చిరు మూవీ ఊచకోత! టాప్ ట్రెండింగ్‌లో దూకుడు!!

వరల్డ్ వైడ్‌గా ఇది రూ.300.3కోట్లు వసూలు చేయగా, ఇండియా నెట్‌ 217.2కోట్లుగా ఉంది. ఇండియా గ్రాస్‌ రూ.257కోట్లు, ఓవర్సీస్‌లో రూ.43కోట్లు రాబట్టింది (చిత్రం బృందం మాత్రం ఇది రూ.380కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది). ఈ మూవీకి రూ.120కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యింది. దాదాపు రూ.60-70 కోట్లకు మధ్య లాభాలు సాధించింది. బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి లాభాల పంట పండించిందని చెప్పొచ్చు. అయితే ఓటీటీలోకి వచ్చిన సినిమా థియేటర్లో ఆడటం చాలా అరుదు. కానీ చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మాత్రం థియేటర్లలో ఇంకా డీసెంట్‌ నెంబర్స్ ని రాబట్టడం విశేషంగా చెప్పొచ్చు.

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ గత వారం జీ 5 ఓటీటీలోకి వచ్చింది. వచ్చిన 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌ని సాధించింది. 200 మిలియన్లకుపైగా వ్యూస్‌ మినిట్స్ ని సాధించింది. ఇప్పుడు వారం గడుస్తున్న టాప్‌లో నడుస్తోంది. ఇప్పుడు టాప్‌ 3లో  ఉండటం విశేషం. ఇక వచ్చే వారం ఇది టీవీలోకి రాబోతుంది. ఈ నెల 28న(శనివారం) జీ తెలుగులో సాయంత్రం 5.30లకు టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని జీ వాళ్లు ప్రకటించారు. మరి అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో దుమ్మురేపిన ఈ చిత్రం టీవీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

టీవీలో కూడా దుమ్ము రేపడానికి రెడీ! రేటింగ్స్ ఎలా ఉండబోతున్నాయో?

చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ, ఫన్‌ కంటెంట్‌తో ఈ మూవీని రూపొందించారు అనిల్‌. మహిళా ప్రేక్షకులకు, చిరంజీవి అభిమానులకు, అలాగే చిన్నపిల్లల్ని అలరించేలా ఈ మూవీ ఉండటంతో అన్ని వర్గాల ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.

చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ మూవీ థియేటర్లు, ఓటీటీలో దుమ్మురేపింది. ఇప్పుడు టీవీలో కూడా రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.