|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు సినిమాని కాపీ కొట్టి బ్లాక్‌బస్టర్ కొట్టాడు వెంకీ! నిర్మాత షాకింగ్ నిజాలు వైరల్!

Published: 18-05-2026, 5:16 PM
చిరు సినిమాని కాపీ కొట్టి బ్లాక్‌బస్టర్ కొట్టాడు వెంకీ! నిర్మాత షాకింగ్ నిజాలు వైరల్!
  • చిరంజీవి `చట్టానికి కళ్లు లేవు` చిత్రం స్ఫూర్తితో వెంకీ `శత్రువు` బ్లాక్‌బస్టర్.
  • నిర్మాత ఎంఎస్ రాజు స్వయంగా నిజాలు బయటపెట్టడంతో వైరల్.
  • 1991లో `శత్రువు` సినిమాతో వెంకటేష్ కెరీర్‌లో మరో మైలురాయి.
  • ఒకే భాషలో హీరో సినిమాను కాపీ కొట్టడం అరుదైన సంఘటన.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్! రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ సంచలన రహస్యం ఇప్పుడు బయటపడింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాను కాపీ కొట్టి విక్టరీ వెంకటేష్ ఎలా బ్లాక్‌బస్టర్ కొట్టారో నిర్మాత స్వయంగా వెల్లడించారు. ఈ వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చిరు చిత్రం.. వెంకీకి బ్లాక్‌బస్టర్ సీక్రెట్!

చిత్ర పరిశ్రమలో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం చాలా సార్లు జరుగుతుంటాయి. కొందరు బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను మిస్‌ చేసుకుంటారు. కొన్ని సార్లు ఒకే తరహా కథలతో సినిమాలు వస్తుంటాయి. ఇతర భాషల సినిమాలను కాపీ కొట్టడం కూడా జరుగుతుంటుంది. అయితే ఒకే భాషకి చెందిన ఒక హీరో సినిమాని, మరో హీరో కాపీ కొట్టడం చాలా అరుదు. కానీ మన టాలీవుడ్‌లో జరిగింది. చిరంజీవి సినిమాని, వెంకటేష్‌ కాపీ కొట్టారు. సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఓపెన్‌గా చెప్పేశాడు.

చిరంజీవి 1981లో `చట్టానికి కళ్లు లేవు` అనే సినిమాలో నటించారు. దీనికి ఎస్‌ చంద్రశేఖర్‌ దర్శకుడు. యాక్షన్‌ ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మాధవి, లక్ష్మి, హేమా సుందర్‌, కన్నడ ప్రభాకర్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఇది తమిళంలో వచ్చిన `సట్టం ఓరు ఇరుట్టరై` అనే చిత్రానికి రీమేక్‌. అక్టోబర్‌ 30న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందింది. అప్పట్లో చిరంజీవి ఇంకా స్టార్‌ కాలేదు, హీరోగా రాణిస్తున్నారు, ఒక రకంగా మంచి బ్రేక్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించుకుంది.

నిర్మాత ఎంఎస్ రాజు సంచలన వ్యాఖ్యలు!

ఇక వెంకటేష్‌ 1986లో `కళియుగ పాండవులు` అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు. అప్పటి వరకు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు వంటి సూపర్ స్టార్స్ హీరోలుగా రాణిస్తున్నారు. వెంకీ ఎంట్రీతో చాలా మంది హీరోల్లో ఒకలాంటి గుబులు స్టార్ట్ అయ్యింది. తమకు పోటీ వస్తారేమో అని భయపడ్డవాళ్లు ఉన్నారు. అయినా ఎవరి దారిలో వాళ్లు, తమ స్టయిల్‌లో సినిమాలు చేసి స్టార్స్ గా రాణించారు. ఇంకా రాణిస్తున్నారు.

ఈ క్రమంలో వెంకటేష్‌.. చిరంజీవి సినిమాని కాపీ కొట్టాడు. ఆయన 1991 `శత్రువు` అనే సినిమాలో నటించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించారు. దీనికి కోడి రామకృష్ణ దర్శకుడు. ఎంఎస్‌ రాజు నిర్మాత. వెంకటేష్‌, విజయశాంతి జంటగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా చిరంజీవి నటించిన `చట్టానికి కళ్లు లేవు` మూవీకి కాపీ అట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఎంఎస్‌ రాజునే తెలిపారు.

కాపీ కథతో రికార్డులు బద్దలు!

ఆయన లేటెస్ట్ గా ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, `చిరంజీవి గారి `చట్టానికి కళ్లు లేవు` సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమానే కాపీ కొట్టి క్యారెక్టర్స్ మార్చి కొన్ని సన్నివేశాలు అల్లుకొని `శత్రువు` అనే సినిమాని వెంకటేష్‌ బాబుతో తీశాను. అందులో అక్కా తమ్ముళ్ల క్యారెక్టర్స్ ని ఇక్కడ లవర్స్ గా చేశాను. సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది` అని తెలిపారు నిర్మాత ఎంఎస్‌ రాజు. ఆయన తాజాగా `ఆగధ` అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఎంఎస్‌ రాజు ఇలాంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సంచలన నిజాలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఒక సినిమా విజయం వెనుక ఎన్ని కథలు ఉంటాయో ఈ సంఘటన నిరూపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.