
📌 Key Points
- కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ దర్శకుడిగా మారారు.
- ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే’ పాటలకు దర్శకత్వం వహించారు సత్య మాస్టర్.
- హైదరాబాద్‌లో జరిగిన పాటల విడుదల వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
- సత్య మాస్టర్ పాటల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
టాలీవుడ్‌లో డ్యాన్స్ మాస్టర్లకు కొదవలేదు. సత్య మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఉంటూనే దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వం వహించిన ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే’ పాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సత్య మాస్టర్ దర్శకత్వంలో కొత్త పాటలు
Tollywood: టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్స్‌కేం కొదవలేదు. బుల్లితెరపై డ్యాన్స్ షోలతో ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ రెడీ అవుతున్నారు. అందరికీ పని దొరకడం కూడా చాలా కష్టమవుతుంది. అలాంటి ఏదో రకంగా కొత్తగా ఆలోచించాలి. అదే చేశాడీ కొరియోగ్రాఫర్. ప్రభుదేవా, రాఘవ లారెన్స్ మాస్టర్, విజయ్ బిన్నీ వంటి వారి తరహాలో తను కూడా మెగా ఫోన్ పట్టారు. అయితే ఆయన మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేసింది మాత్రం సినిమా కాదు. అసలా డైరెక్టర్ ఎవరు? ఆయన ఏం చేశారనే విషయానికి వస్తే.. ఆ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు.. సత్య మాస్టర్. అదోనై పిక్చర్స్ క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ కొరియగ్రాఫర్ సత్య మాస్టర్ దర్శకత్వంలో అంకిత జాదవ్, రోహిత్ భోగ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నువ్వే ఉండిపో ఇలా’, ‘నువ్వేలే’ పేరుతో రెండు సాంగ్స్‌ని రూపొందించారు. ఈ పాటలకు కెకె రెడ్డి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
పాటల విడుదల వేడుకలో ప్రముఖులు
జయంత్ ఆర్యన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటలకు రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించగా.. సింగర్స్ లిప్సిక, అదితి భావరాజు పాడారు. తాజాగా ఈ సాంగ్స్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సాయి రాజేశ్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆషురెడ్డి వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ.. నేను ఒక ఈవెంట్ నిమిత్తం యూఎస్‌కు వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్ కేకే రెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఈ సాంగ్స్ హిందీ వెర్షన్ రెడీగా ఉన్నాయి. తెలుగులో చేయాలనే ఆలోచనను వారు నాతో షేర్ చేసుకున్నారు. అలా ఈ రెండు పాటలు తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించాం. అతి తక్కువ మంది క్రూతో ఈ పాటలను తక్కువ టైమ్‌లో కంప్లీట్ చేశాం. అన్నీ మేమే అయ్యి ఈ పాటలను చిత్రీకరించాం. ప్రొడ్యూసర్ కేకే రెడ్డి ఎంతో ప్యాషనేట్‌గా ఈ పాటలను ప్రొడ్యూస్ చేశారు. జయంత్ మ్యూజిక్, లిప్సిక, అదితి పాడిన తీరు, రాంబాబు సాహిత్యం అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయని అన్నారు.
నిర్మాత కె.కె. రెడ్డి మాటలు
నిర్మాత కేకే రెడ్డి మాట్లాడుతూ.. మంచి లవ్ ఫీల్‌తో ఈ పాటలను బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశారు మా డైరెక్టర్ సత్య. ఆయన కొరియోగ్రఫీ కూడా ఈ పాటలకు హైలైట్ అవుతుంది. లిప్సిక, అదితి ఈ పాటలను పాడిన విధానం చూస్తే వారికి గానకోకిల అని పిలవాలని అనిపిస్తోంది. జయంత్ మంచి ట్యూన్‌తో కంపోజ్ చేశారు. ఈ పాటలు మళ్లీ మళ్లీ వినేలా ఉంటాయని తెలిపారు. హీరోయిన్ అంకిత జాదవ్ మాట్లాడుతూ.. నేను బాలీవుడ్‌లో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంటాను. నేను చేసిన ఐదో మ్యూజిక్ ఆల్బమ్ ఇది. ఈ రెండు పాటలను న్యూయార్క్, షికాగోలో షూటింగ్ చేశాం. అక్కడ అననుకూల వాతావరణంలో సాంగ్స్‌ను కష్టపడి చిత్రీకరించాం. సత్య మాస్టర్ డైరెక్షన్‌లో ఈ సాంగ్స్ చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
సత్య మాస్టర్ దర్శకత్వం వహించిన ఈ పాటలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. తక్కువ సమయంలోనే ఈ పాటలను పూర్తి చేశామని ఆయన తెలిపారు.


