|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్రిస్మస్ 2025 బాక్సాఫీస్ వార్: ఈ సినిమాల మధ్యే అసలు పోటీ! మీ ఫేవరెట్ ఏది?

Published: 16-12-2025, 3:24 AM
క్రిస్మస్ 2025 బాక్సాఫీస్ వార్: ఈ సినిమాల మధ్యే అసలు పోటీ! మీ ఫేవరెట్ ఏది?
  • క్రిస్మస్ 2025కి ‘చాంపియన్’ (రోషన్), ‘దండోరా’ (శివాజీ, నవదీప్), ‘శంబల’ (ఆది సాయికుమార్), ‘ఈషా’ (హెబ్బా పటేల్) విడుదలవుతున్నాయి.
  • ‘చాంపియన్’ ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా, స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
  • ‘దండోరా’ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.
  • ‘శంబల’ యాక్షన్ చిత్రంగా, ‘ఈషా’ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఈ క్రిస్మస్ 2025 పండుగకు థియేటర్లలో భారీ సందడి నెలకొననుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పలు ఆసక్తికర చిత్రాలు విడుదలవుతున్నాయి. ‘చాంపియన్’, ‘దండోరా’, ‘శంబల’, ‘ఈషా’ వంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పండగ సీజన్‌లో బాక్సాఫీస్‌పై ఏ చిత్రం ఆధిపత్యం చెలాయించనుందో చూడాలి.

క్రిస్మస్ బరిలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్’

Christamas Releases 2025 : డిసెంబర్ నెల మరికొన్ని రోజుల్లో మరికొన్ని రోజుల్లో ఎండ్ అవుతుంది. ఈనెలలో కొత్త సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి.. అందులో స్టార్ హీరోల సినిమాలు పెద్దగా లేకపోవడంతో చిన్న సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. డిసెంబర్ 12న చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమా కూడా జనాలను పెద్దగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం క్రిస్మస్ కి రిలీజ్ కాబోతున్న సినిమాల కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు తో పాటు మిగిలిన భాషల్లో కూడా డిసెంబర్ 25న బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు? క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

రోషన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘చాంపియన్‌’. అనస్వర రాజన్‌ కథానాయిక. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ కలిసి నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి ఈ సినిమా రాబోతుంది..

‘కలర్ ఫొటో’, బ్లాక్‌బస్టర్ ‘బెదురులంక 2012’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెన‌ర్జీ నిర్మిస్తున్న తాజా చిత్రం దండోరా.. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శంబాల.. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది..

‘దండోరా’, ‘శంబల’: మల్టీస్టారర్, యాక్షన్ థ్రిల్లర్లతో పండగ

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్, త్రిగుణ్ మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ఈషా… ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ.. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.

ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా ‘పతంగ్‌’. గౌతమ్‌ వాసుదేవమీనన్‌, ఎస్పీ చరణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది..

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య మన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్యాడ్ గాళ్స్.. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌ సంయుక్తంగా తెరకెక్కింది.. ఫణి ప్రదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 25న సినిమా థియేటర్లలోకి రాబోతుంది..

హారర్ థ్రిల్లర్ ‘ఈషా’తో హెబ్బా పటేల్ సందడి

విక్రమ్ ప్రభు నటించిన ఒక రాబోయే తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సిరై.. సురేష్ రాజకుమారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 25న విడుదల కాబోతుంది.

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ కిచ్చా సుదీప్ న‌టిస్తోన్న లేటెస్ట్ చిత్రం మార్క్ . మ‌రోమారు ఔట్ అండ్ ఔట్ హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది.

వీటితో పాటుగా 45వ మూవీ, మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం వృషభ, వానర, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వంటి సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా క్రిస్మస్ కానుకగా 25న ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.. వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుందో చూడాలి..

ఈ క్రిస్మస్ 2025కి థియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడనున్నాయి. స్పోర్ట్స్ డ్రామా, మల్టీస్టారర్, హారర్ థ్రిల్లర్ వంటి విభిన్న జానర్లలో వస్తున్న ఈ చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయని ఆశిద్దాం. ఏ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.