
📌 Key Points
- ‘నాగబంధం’లో గరుడ రామ్ ‘బైరాగి’గా భయంకరమైన పాత్రలో నటిస్తున్నారు.
- గరుడ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- ఈ చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 15న మహేష్ బాబు విడుదల చేయనున్నారు.
- ‘నాగబంధం’ చిత్రం భారతీయ పురాణాల కలయికతో రూపొందుతోంది.
టాలీవుడ్‌లో ‘నాగబంధం’ చిత్రం ఒక సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో గరుడ రామ్ ‘బైరాగి’ పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీనికి విశేష స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 15న మహేష్ బాబు టీజర్ విడుదల చేయనున్నారు.
‘నాగబంధం’లో గరుడ రామ్ భయంకరమైన లుక్
Nagabandham: టాలీవుడ్‌లో కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతున్న పేరు ‘నాగబంధం’ (Nagabandham). అద్భుతమైన విజువల్స్, వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ, భారతీయ పురాణాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలను భారీగా పెరుగుతున్నాయి. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ పాన్-ఇండియా విజువల్ వండర్ నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ‘కెజియఫ్’ సినిమాతో తన విలనిజంతో దేశాన్ని వణికించిన గరుడ రామ్ (Garuda Ram), ఈ చిత్రంలో ‘బైరాగి’ (Bhairagi) అనే అత్యంత శక్తివంతమైన, భయంకరమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫస్ట్ లుక్
ఫస్ట్ లుక్‌ని గమనిస్తే.. ‘గరుడ రామ్’ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆ భారీ కాయం, తీక్షణమైన చూపులు. అయితే ‘నాగబంధం’ కోసం ఆయనను మలిచిన తీరు మాములుగా లేదు. ఒళ్లంతా విభూతి పూసుకుని, జడలు కట్టిన జుట్టుతో, మెడలో రుద్రాక్షలు, ఎముకలతో చేసిన మాలలు ధరించి ఆయన కనిపిస్తున్న తీరు ఒక శక్తివంతమైన తాంత్రిక యోధుడిని తలపిస్తోంది.ఈ పోస్టర్‌లో గరుడ రామ్ చేతిలో కపాలాలు, పాములతో కూడిన భారీ దండం పట్టుకుని ఉన్నారు. ఇది ఆయన పాత్రలోని చీకటి కోణాన్ని, నిషిద్ధ శక్తులపై ఆయనకున్న పట్టును తెలియజేస్తుంది. అడవి నేపథ్యంలో, చుట్టూ పాములు, చెల్లాచెదురుగా ఉన్న పుర్రెలు వంటివి.. సినిమాలో మిస్టికల్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో హింట్ ఇస్తున్నాయి. గరుడ రామ్ పోషించిన ఈ ‘బైరాగి’ పాత్ర సినిమాకే మెయిన్ పిల్లర్‌గా నిలవనుందని ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది.
మహేష్ బాబు చేతుల మీదుగా టీజర్ విడుదల
ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఏమాత్రం తగ్గడం లేదు. మహా శివరాత్రి శుభ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 15న సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. శివుని ఆజ్ఞతో మొదలయ్యే ఈ ‘నాగబంధం’ ప్రయాణం.. టీజర్‌తో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయమని చెప్పొచ్చు. అభిషేక్ నామా కేవలం దర్శకత్వం వహించడమే కాకుండా, ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన లుక్స్, తాజాగా వచ్చిన ‘బైరాగి’ లుక్ చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద ‘నాగబంధం’ విధ్వంసం సృష్టించడం ఖాయమనిపిస్తోంది. చూద్దాం.. ఈ వేసవికి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో..
మొత్తానికి ‘నాగబంధం’ సినిమా టీజర్ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గరుడ రామ్ పాత్ర సినిమాకు హైలైట్ కానుంది. ఈ సినిమా ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్తుంది అని చెప్పవచ్చు.


