|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా కష్టాలు: బాక్సాఫీస్ బోసిపోయింది.. ఎగ్జిబిటర్ల కన్నీళ్లు.. ఈ దుస్థితి ఎప్పుడు మారుతుంది?

Published: 08-05-2026, 8:16 PM
సినిమా కష్టాలు: బాక్సాఫీస్ బోసిపోయింది.. ఎగ్జిబిటర్ల కన్నీళ్లు.. ఈ దుస్థితి ఎప్పుడు మారుతుంది?
  • సమ్మర్ సీజన్‌లోనూ థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
  • పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం, చిన్న చిత్రాలు నిరాశపరచడం బాక్సాఫీస్ పతనానికి కారణం.
  • ‘గోదారి గట్టుపైన’, ‘సతీ లీలావతి’, ‘రేజర్’ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి.
  • ప్రమోషన్ల లేమి, ప్రేక్షకుల ఆదరణ కొరవడటం సినిమా పరిశ్రమకు ప్రధాన సమస్యలు.

ఒకప్పుడు సమ్మర్ అంటే సినిమా థియేటర్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. పెద్ద సినిమాలు లేక, వచ్చిన చిన్న చిత్రాలు అలరించక బాక్సాఫీస్ బోసిపోతోంది. ఈ వారం విడుదలైన సినిమాలు కూడా నిరాశపరచడంతో ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు.

సమ్మర్ బాక్సాఫీస్ దుస్థితి

Summer Boxoffice : ఒకప్పుడు సమ్మర్ సీజన్ వస్తే సినిమా థియేటర్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.అసలే గత పెద్ద హీరోల సినిమాలు లేక సగానికి సగానికి ఆక్యుపెన్సీ తగ్గితే, వచ్చిన చిన్నా చితాకా సినిమాలు కాస్తా అలరించక ఆ మిగిలిన సగాన్ని కూడా బయపెట్టేస్తున్నాయ్.ఇక ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలు కూడా అదే బాట పట్టడంతో ఎప్పటిలాగే బోసిపోతుంది బాక్సాఫీస్.

గోదారి గట్టున ప్రేక్షకులు ఏరి?

సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ‘గోదారి గట్టుపైన’ సినిమాపై ముందే అంచనాలు తక్కువ. ‘మేమ్ ఫేమస్’తో పర్లేదనిపించిన ఈ కుర్రాడికి ఇప్పుడు ఆ మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టం అయిపొయింది. అప్పట్లో మెయిన్ సెంటర్లలో భారీగా ప్రీమియర్లు వేస్తే, ఈసారి మాత్రం కేవలం హైదరాబాద్‌తో పాటు అతికొద్ది ప్రాంతాలకే పరిమితం చేయడం గమనార్హం.ఇకప్రీమియర్ టాక్ మిక్స్‌డ్‌గా ఉండటంతో రెగ్యులర్ ఆడియన్స్ అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. కూల్ సమ్మర్ అంటూ ప్రచారం చేసినా, థియేటర్లో మాత్రం ఆ కూల్‌నెస్ కనిపించడం లేదన్నది చూసిన వాళ్ళ మాట.

కొత్త సినిమాల నిరాశ

మెగా కోడలి సైలెంట్ ఎంట్రీ.. రిజల్ట్ షాకింగ్

ఇక ఈరోజే వచ్చిన మరో సినిమా ‘సతీ లీలావతి’. నిజానికి మెగా ట్యాగ్ వల్ల ఈ సినిమాకు మంచి హైప్ వచ్చే అవకాశం బాగానే ఉండేది. దానికి తోడు రామ్ చరణ్ ట్రైలర్ లాంచ్ చేయడంతో ఏదో జరుగుతుందని ఊహించారు. కానీ, కనీసం ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించకుండా సినిమాను సైలెంట్‌గా థియేటర్లలోకి వదిలేశారు. చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రమోషన్లకు వస్తారని ఆశ పడ్డ ఆడియన్స్ కి నిరాశే ఎదురైంది.ప్రమోషన్లు పెద్దగా లేకపోవడంతో అసలు ఈ సినిమా థియేటర్లలో ఉందన్న విషయమే సగం మందికి తెలికుండా పోయిందంటే సినిమా ప్రచారంలో ఎంత వీక్ అనండి తెలిసిపోతుంది.ఫలితంగా మార్నింగ్ షోలకే జనం లేక థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి.ఇక టికెట్లు తెగక కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్నాయి కూడా.పైగా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదన్న ప్రచారం సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత తగ్గించేసింది.

రేజర్’ పరిస్థితి అయితే మరీ దారుణం

ఇక ప్రయోగాత్మక దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘రేజర్’ పరిస్థితి అయితే మరీ దారుణం. ఓపెనింగ్స్ లో కనీసం మినిమం అంటే మినిమం కూడా వసూలు చేయలేదంటే రేజర్ ఎంత మొండి బారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో రవిబాబు సినిమాలకు ఉండే క్రేజ్ ఇప్పుడు ఏ కోశానా కనిపించడం లేదు.రవి బాబు ప్రచారాన్ని అంతా ఒంటి మీద వేసుకున్నా సినిమా కథలో సరైన కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు.

ఎగ్జిబిటర్ల కష్టాలు

ఎగ్జిబిటర్లు ఈ సినిమాలకి బలైనట్టే

ఓటీటీల ప్రభావం, పైరసీ బెడద ఎలా ఉన్నా.. సరైన పబ్లిసిటీ లేకుండా, కంటెంట్‌పై నమ్మకం లేకుండా సినిమాలను విడుదల చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇవాళ వచ్చిన సినిమాలు కనీసం వీకెండ్ వరకైనా నిలబడతాయా? లేక మొదటి రోజుకే సర్దేస్తాయా? అనేది చూడాలి. మొత్తానికి ఈ శుక్రవారం సినిమాలని వేసుకున్న ఎగ్జిబిటర్లు ఈ సినిమాలకి బలైనట్టే కనిపిస్తుంది. చూడాలి మరి థియేటర్స్ అన్నీ పెద్ది రాక కోసం ఎదురుచూస్తాయా ..లేక ఈ మధ్యలో ఏదైనా సినిమా వాటి ఆకలిని తీరుస్తుందా !

మొత్తంగా, తెలుగు సినిమా బాక్సాఫీస్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు, సినిమాలు నిలబడటం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, సినిమా పరిశ్రమకు మరింత నష్టం తప్పదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.