
📌 Key Points
- తమిళ రాజకీయాల్లో సినిమా గ్లామర్ ఎప్పుడూ ఒక ఆకర్షణీయ అంశమే.
- విజయ్ తన ‘టీవీకే’ పార్టీతో ఒంటరిగా రాజకీయ పోరాటం చేస్తున్నారు.
- త్రిష విజయ్ పార్టీలో చేరతారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
- డీఎంకే, అన్నాడీఎంకే వంటి బలమైన పార్టీలను విజయ్ ఎదుర్కోవడం సవాలుగా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో సినిమా రంగానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎంజీఆర్, జయలలిత వంటి వారు రాణించినా, నేటి తరుణంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. విజయ్ రాజకీయ ప్రవేశం, త్రిష రాకతో రాజకీయ సమీకరణాలు మారుతాయేమో చూడాలి.
తమిళ రాజకీయాల్లో సినిమా గ్లామర్
Cinima Vs Politics: తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయలేని బంధం ఉంది. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి వారు వెండితెరపై ఎంతగా మెరిశారో, రాజకీయాల్లోనూ అంతటి విజయాన్ని అందుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు కేవలం సినిమా గ్లామర్ చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు. కమల్ హాసన్ వంటి వారు పోరాడుతున్నా, రజనీకాంత్ వంటి వారు వెనకడుగు వేసినా, ఇప్పుడు దళపతి విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా త్రిష కూడా ఆయనతో చేరబోతున్నారనే వార్తలు రాజకీయ సమీకరణాలను వేడెక్కిస్తున్నాయి.
తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ తన ‘టీవీకే’ (TVK) పార్టీతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల కూటములను ఎదుర్కోవడం విజయ్‌కు పెద్ద సవాలుగా మారింది. ఇక ఇప్పుడు దీనికి తోడు విడాకుల వివాదం, వ్యక్తిగత విమర్శలు ఆయనను చుట్టుముట్టాయి. ఇక ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ త్రిష కూడా విజయ్ పార్టీలో చేరతారని, ఆమె చెన్నై నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం తమిళ నాట జోరుగా సాగుతోంది. సినిమా గ్లామర్‌ను రాజకీయ బలంగా మార్చుకోవాలని విజయ్ భావిస్తున్నప్పటికీ, అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
విజయ్ ఒంటరి పోరాటం
ఒకప్పుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సునామీ ఖాయమని భావించినా, ఆయన అనారోగ్య కారణాలతో చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఇక కమల్ హాసన్ (MNM) పార్టీ పెట్టినా, ఆశించిన స్థాయిలో ఓట్ల శాతాన్ని సాధించలేకపోయారు. గతంలో విజయకాంత్ కొంతకాలం ప్రతిపక్ష నేతగా రాణించినా, కాలక్రమేణా ఆయన ప్రభావం తగ్గింది. దీనంతటికీ కారణం ఒక్కటే.. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కేడర్ చాలా బలంగా ఉండటం. సినిమా హీరోల గ్లామర్ చూసి జనాలు ఈలలు వేస్తారు కానీ, ఓటు వేసేటప్పుడు మాత్రం పార్టీల బలాబలాలను చూస్తున్నారని చరిత్ర చెబుతోంది.
త్రిష రాకతో సమీకరణాలు మారుతాయా?
తమిళనాడులో ఇప్పుడు సినిమా స్టార్లకు రాజకీయం ఒక ‘ముళ్ల బాట’లా మారింది. కేవలం సినిమాల్లో పంచ్ డైలాగులు చెబితే సరిపోదని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఓటర్లు కోరుకుంటున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొంటున్న వ్యక్తిగత విమర్శలు ఆయన ఇమేజ్‌కు కొంత ఇబ్బందిగా మారాయి. గ్లామర్ ప్లస్ పాలిటిక్స్ కలిస్తేనే విజయం సాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం విజయ్ పక్కన త్రిష వంటి స్టార్ ఇమేజ్ ఉన్న వారు చేరితే యువతను ఆకట్టుకోవచ్చని ఒక వర్గం భావిస్తోంది.ఇక సినిమా వాళ్లకు రాజకీయాలు అప్పట్లో కలిసి వచ్చినంతగా ఇప్పుడు కలిసి రావడం లేదు. విజయ్ చేస్తున్న ఈ ప్రయత్నం రేపటి తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పు తెస్తుందో చూడాలి. ఇక త్రిష రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
సినిమా గ్లామర్‌తో రాజకీయాల్లో నెగ్గుకురావడం అంత సులువు కాదు. విజయ్ తన వ్యక్తిగత విమర్శలను అధిగమించి, ప్రజల మద్దతు కూడగట్టుకుంటేనే విజయం సాధించగలరు.


