
📌 Key Points
- లోక్‌సభ స్థానాల పునర్విభజనలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరం పెంచే ప్రయత్నాలను సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు.
- ప్రస్తుతమున్న స్థానాలకు 50% సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
- కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
- హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ ట్రెయిన్లు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరం పెంచే ప్రయత్నాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు ఉండకూడదని ఆయన అన్నారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ రెడ్డి ఆందోళన
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని మరింతగా పెంచే ప్రయత్నాలను విరమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రాల వారిగా ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తిలోనే నియోజకవర్గాలను పెంచాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న స్థానాలకు 50 శాతం సీట్లు పెంచుతూ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే…. రేపటి రోజున జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండదని విశ్లేషించారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా పోతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ‘భారతదేశం – ప్రపంచం’ అన్న ఇతివృత్తంపై “వాట్ ఇండియా థింక్స్ టుడే” సమ్మిట్ 2026 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, మూసీ నది ప్రక్షాళన, తెలంగాణ విజన్ 2047, పరిపాలన, రాజకీయ స్థితిగతులపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో 50 శాతం మేరకు సీట్లను పెంచాలన్న నిర్ణయం ఏ ప్రాతిపదికన చేశారని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వల్ల ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై తొలుత అఖిల పక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందని ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయపడ్డారు. అలా కాకుండా ముందే నిర్ణయం తీసుకుని…. తర్వాత అందరి అభిప్రాయాలు అడగడటం సమంజసం కాదన్నారు.
కేంద్రం, రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలనే మేం కోరుకుంటున్నామని చెప్పారు. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలే కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురికావడమే కాకుండా తీరని నష్టం జరుగుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
మంచి ఎక్కడున్నా స్వీకరిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ ట్రెయిన్లు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పానని గుర్తుచేశారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత సమస్యను ఎదుర్కొనడానికి కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌సభ స్థానాల పునర్విభజనపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


