
📌 Key Points
- మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్-10లో తెలంగాణకు చెందిన తల్లి, కూతురు సాయి శ్రీ, చందన రన్నరప్‌గా నిలిచారు.
- మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి శ్రీ, చందన జోడీ ఫార్మాట్‌లో పాల్గొని తమ వంటకాలతో జడ్జీలను ఆకట్టుకున్నారు.
- తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక జోడీగా టాప్-12, టాప్-5 దశలను దాటుకుని ఫైనల్స్‌కు చేరుకున్నారు.
- గ్రాండ్ ఫినాలేలో కోల్‌కతాకు చెందిన సుదీప్తా సర్కార్ విజేతగా నిలిచారు.
ప్రముఖ రియాలిటీ షో మాస్టర్‌చెఫ్ ఇండియాలో తెలంగాణకు చెందిన తల్లి, కూతురు సాయి శ్రీ, చందన అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాలకు కీర్తి తెచ్చారు. వారి ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
మాస్టర్‌చెఫ్ ఇండియాలో తెలంగాణ జోడీ సత్తా
ప్రముఖ రియాలిటీ షో మాస్టర్‌చెఫ్ ఇండియా (MasterChef India) ఫ్రోగ్రామ్ కి భారత్ లో అనేక ఆధరణ ఉంది. ఇప్పటికే వరుసగా 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా సీజన్-10 కు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ మాస్టర్‌చెఫ్ ఇండియా తెలంగాణకు చెందిన తల్లి-కూతుళ్ల జోడీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మంచిర్యాల జిల్లాకు చెందిన రాచకొండ సాయి శ్రీ, ఆమె తల్లి చందన, దేశవ్యాప్తంగా వేలాది మంది పోటీ పడిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో రన్నరప్ (Runner-up)గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈ సీజన్‌లో మాస్టర్‌చెఫ్ తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘జోడీ ఫార్మాట్’లో పాల్గొన్న వీరు, తమదైన వంటకాలతో జడ్జీల మనసు గెలుచుకున్నారు.
అలాగే ఈ షోలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక జోడీగా సాయి శ్రీ-చందన (Sai Sri-Chandana) అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్-12, టాప్-5 దశలను దాటుకుని ఫైనల్స్‌కు చేరుకున్నారు. గ్రాండ్ ఫినాలే (grand finale)లో హోరాహోరీగా తలపడి టాప్-2లో నిలిచి రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, జాతీయ స్థాయి వేదికపై తెలుగు రుచుల సత్తా చాటడం పట్ల నెటిజన్లు, తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మాస్టర్‌చెఫ్ ఇండియా ఫైనల్ అత్యంత ఉత్కంఠభరితమైన పోరు సాగింది. ఈ సీజన్ విజేతగా కోల్‌కతాకు చెందిన సుదీప్తా సర్కార్ (Sudipta Sarkar) నిలిచారు.
జోడీ ఫార్మాట్‌లో సాయి శ్రీ-చందన అద్భుతం
ఫైనల్స్‌లో హోరాహోరీ పోరు, రన్నరప్‌గా నిలిచిన తెలుగు తేజాలు
మాస్టర్‌చెఫ్ ఇండియాలో తెలంగాణకు చెందిన సాయి శ్రీ, చందన రన్నరప్‌గా నిలవడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. వారి ప్రతిభను కొనసాగిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


