|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Coolie First Review: ‘కూలీ’పై తమిళనాడు డిప్యూటీ సీఎం రివ్యూ

Published: 13-08-2025, 5:58 AM
Coolie First Review: ‘కూలీ’పై తమిళనాడు డిప్యూటీ సీఎం రివ్యూ

ఆగష్టు 14న విడుదల కానున్న రజనీకాంత్ ‘కూలీ’ సినిమాను తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ముందుగా చూసి, పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ అని ప్రశంసించారు. నాగార్జున విలన్ గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

Key Points

1

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ 'కూలీ' సినిమాను ముందుగా చూశారు.

2

సినిమాను 'పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్' అని ప్రశంసించారు.

4

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున నటించిన 'కూలీ' ఆగస్టు 14న విడుదల కానుంది.

ఉదయనిధి స్టాలిన్ రివ్యూ

మరికొన్ని గంటల్లో(ఆగస్ట్‌ 14) రజనీకాంత్‌ ‘కూలీ’(Coolie) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ రివ్యూ ఇచ్చాడు. ఇదొక పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.

‘కూలీ’ సినిమా ప్రశంసలు

‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు. రేపు విడుదల కానున్న ‘కూలీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీన్ని ముందుగా చూసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. ఈ పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ని బాగా ఎంజాయ్‌ చేశా. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని ఉదయనిధి ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

ఆగస్టు 14న విడుదల

‘కూలీ’ విషయానికొస్తే..లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్‌ అగ్రహీరో నాగార్జున విలన్‌గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు.

ఉదయనిధి స్టాలిన్ ప్రశంసలతో ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రజనీకాంత్ అభిమానులకు ఈ సినిమా పెద్ద విందు అనిపించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.