
సుపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా థియేటర్లలో అద్భుత విజయం సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు ఇక్కడ చూడండి.
Key Points
రజనీకాంత్ ‘కూలీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది.
అక్టోబర్ లో ఓటీటీ రిలీజ్ అవ్వనుంది.
కూలీ బాక్సాఫీస్ కలెక్షన్లు
రజనీకాంత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ (Coolie) బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. థియేటర్లలో కలెక్షన్ల ఊచకోతకు దిగింది. వసూళ్లలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది కూలీ. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ నెలకొంది.
కూలీ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది. అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన తమిళ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ కానుంది. కూలీ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం.
ఓటీటీ రిలీజ్ తేదీ
తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో థియేటర్లలో రిలీజైన కూలీ .. ఓటీటీలోనూ ఈ భాషల్లో ఆడియన్స్ ను అలరించనుంది. కూలీ సినిమా డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్ల భారీ ధర చెల్లించిందని తెలిసింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను సన్ టీవీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది.
కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికీ అధికారిక సమాచారమైతే లేదు. ఇటు మూవీ ప్రొడక్షన్ హౌజ్ కానీ అటు అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూలీ మూవీ థియేట్రికల్ రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. అంటే అక్టోబర్ 10న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.
కూలీ సినిమా విశేషాలు
అయితే థియేటర్లలో కూలీ సినిమా అదరగొడుతుంది కాబట్టి ఓటీటీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగొచ్చు. దసరా సందర్భంగా అక్టోబర్ 2న లేదా దీపావళిని పురస్కరించుకుని అక్టోబర్ 20న కూలీ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. మరి మేకర్స్ ఏ డేట్ ను కన్ఫార్మ్ చేస్తారో చూడాలి.
కూలీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజనీకాంత్ , నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ తదితరులు నటించారు. ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.
రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ రిలీజ్ తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు.


