
📌 Key Points
- ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ బదులు రాగి బాటిళ్లను వాడటం పెరిగింది.
- రాగి ఒక చురుకైన లోహం, కొన్ని పదార్థాలతో కలిస్తే విషపూరితం కావచ్చు.
- పుల్లని పానీయాలు, మసాలాలు, ఐస్ ముక్కలు రాగి బాటిల్‌లో పోయకూడదు.
- రాగి బాటిల్‌లో కేవలం సాధారణ నీటిని మాత్రమే నిల్వ చేయడం సురక్షితం.
ఆరోగ్యం కోసం రాగి బాటిళ్లను వాడుతున్నారా? అయితే జాగ్రత్త! రాగి ఒక చురుకైన లోహం. కొన్ని పదార్థాలు రాగితో కలిస్తే విషపూరితంగా మారతాయి. రాగి బాటిల్‌లో ఏవి పోయాలి, వేటికి దూరంగా ఉండాలో తెలుసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
రాగి బాటిల్ ఉపయోగాలు: నిజాలు, అపోహలు
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తర్వాత చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లను పక్కనబెట్టి రాగి సీసాలను ఉపయోగించడం ప్రారంభించారు. పూర్వకాలంలో మన పెద్దలు ఇళ్లలో రాగి కుండలు లేదా పెద్ద పాత్రలను ఉపయోగించేవారు, ఇప్పుడు అవి బాటిళ్ల రూపంలో రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్ముతారు. అయితే, రాగి బాటిల్‌ను సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే ఆశించిన ప్రయోజనాలు అందుతాయి.
చాలామంది ప్రయాణాల్లో లేదా ఆఫీసులకు వెళ్లేటప్పుడు రాగి బాటిళ్లలో కేవలం నీటినే కాకుండా రకరకాల పానీయాలను నింపుతుంటారు. కానీ… రాగి ఒక చురుకైన లోహం అనే విషయాన్ని మరువకూడదు. కొన్ని పదార్థాలు రాగితో కలిసినప్పుడు రసాయన చర్య జరిగి అవి విషపూరితంగా మారుతాయి. అందువల్ల రాగి బాటిల్‌లో ఏవి పెట్టాలి, వేటికి దూరంగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
రాగిలో ఏవి పోయకూడదు? ప్రమాదాలు
రాగి బాటిల్ యొక్క ఉత్తమ మరియు సురక్షితమైన ఉపయోగం ఏమిటంటే.. అందులో కేవలం సాధారణ నీటిని మాత్రమే నిల్వ చేయడం. రాత్రిపూట సాధారణ నీటిని రాగి బాటిల్‌లో పోసి ఉంచి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే సరిపోతుంది. ఆ నీటిలో ఎలాంటి పుల్లని పానీయాలు, మసాలాలు లేదా ఐస్ ముక్కలు వంటివి కలపాల్సిన అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన నీటిని మాత్రమే రాగి పాత్రల్లో ఉంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాగి బాటిల్: సరైన వినియోగ పద్ధతి
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రాగి బాటిల్ వాడకం ఆరోగ్యానికి మంచిదే అయినా, సరైన జాగ్రత్తలు తప్పనిసరి. కేవలం స్వచ్ఛమైన నీటిని మాత్రమే నిల్వ చేయడం ద్వారా రాగి బాటిల్ ప్రయోజనాలను సురక్షితంగా పొందవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి.


