|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మూడు రాశులకు రెండు దీపావళులు: రాహువు అనుగ్రహంతో వాహనాలు, ఆస్తులు, డబ్బు!

Published: 25-09-2025, 11:17 AM
మూడు రాశులకు రెండు దీపావళులు: రాహువు అనుగ్రహంతో వాహనాలు, ఆస్తులు, డబ్బు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు నక్షత్ర సంచారం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది దీపావళి తర్వాత రాహువు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేషం, ధనుస్సు, కన్య రాశుల వారు అదృష్టవంతులు.

Key Points

1

మేషం, ధనుస్సు, కన్య రాశుల వారు ద్విగుణ దీపావళి!

2

రాహువు శతభిష నక్షత్ర సంచారం వల్ల అనేక శుభ ఫలితాలు!

4

కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల!

రాహువు నక్షత్ర సంచారం

గ్రహాలు ఎప్పటికప్పుడు శుభ యోగాలను తీసుకొస్తూ ఉంటాయి. కాలానుగుణంగా గ్రహాలు మార్పు చెందడంతో ఫలితం ద్వాదశ రాశులపై పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే రాహువుని నీడగ్రహం అని అంటారు. రాహువు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా నక్షత్రాలని కూడా మారుస్తాడు. దీపావళి తర్వాత రాహువు నక్షత్రం మార్పు చేస్తాడు. రాహువు నక్షత్ర సంచారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను ఎదుర్కొంటారు.

దీపావళి తర్వాత రాహు సంచారంలో మార్పు

ఈ ఏడాది దీపావళి తర్వాత రాహువు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. రాహువు శతభిష నక్షత్రంలోకి అడుగు పెడతాడు. రాహువు ఈ నక్షత్రానికి అధిపతి. సొంత నక్షత్రంలోకి రాహువు అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మూడు రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

మేషం, ధనుస్సు, కన్య రాశులకు శుభ ఫలితాలు

మేష రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం మంచి ఫలితాలను తీసుకురానుంది. ఈ రాశి వారు సక్సెస్‌ని అందుకుంటారు. ఎక్కువ లాభాలను పొందుతారు. అన్ని పనుల్లో కూడా మేష రాశి వారు ఉత్సాహంగా పాల్గొంటారు. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

ఉద్యోగులకు, వ్యాపారులకు ఇది చక్కటి సమయం. ఆర్థికంగా బావుంటుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. పాత వివాదాలన్నీ తొలగిపోతాయి. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. ఈ రాశి వారి జీవితంలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. సంపద పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.

ఆర్థిక, వృత్తిపరమైన విజయాలు

కుటుంబ సభ్యులందరి మద్దతు ఉంటుంది. రాహువు అనుగ్రహం వలన ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. కెరీర్‌లో, వ్యాపారంలో అనేక లాభాలు ఉంటాయి. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది.

కన్యా రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం మంచి ఫలితాలని అందిస్తుంది. ఈ రాశి వారు శుభఫలితాలను అందుకుంటారు. శుభవార్తలు వింటారు. కెరీర్‌లో బావుంటుంది. ఈ రాశి వారికి గౌరవం, కీర్తి లభిస్తాయి.

రాహువు అనుగ్రహంతో ఈ రాశి వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. విజయాలను అందుకుంటారు. వాహనాలను కొనుగోలు చేయొచ్చు. ఆస్తి కూడా మీ చేతికి వస్తుంది.

రాహువు శతభిష నక్షత్ర సంచారం ఈ మూడు రాశుల వారికి అనేక శుభాలను తెస్తుంది. శ్రద్ధ, కృషితో మీ లక్ష్యాలను సాధించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.