|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Deepika Padukone: దీపిక కండీషన్స్‌కి అల్లు అర్జున్-అట్లీ ఒ‍ప్పుకొన్నారా?

Published: 07-06-2025, 3:44 AM
Deepika Padukone: దీపిక కండీషన్స్‌కి అల్లు అర్జున్-అట్లీ ఒ‍ప్పుకొన్నారా?

బాలీవుడ్ నటి దీపిక పదుకొణె ప్రభాస్ సినిమాకు నో చెప్పి, అల్లు అర్జున్ సినిమాకు ఓకే చెప్పడం విశేషం. దీనికి కారణం ఆమె పెట్టిన కండిషన్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. అట్లీ దర్శకత్వంలోని ఈ సినిమాలో దీపిక పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Key Points

1

దీపిక పదుకొనే ప్రభాస్ సినిమాకు నో చెప్పడం

2

అల్లు అర్జున్ సినిమాలో దీపిక ఎంపిక

4

అట్లీ దీపిక కండిషన్స్‌కు ఒప్పుకున్నారా?

ప్రభాస్ సినిమాకు దీపిక నో

అల్లు అర్జున్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెని ఎంపిక చేశారు. గ్రాండ్ ఇంట్రడక్షన్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు. ఇందులో సూపర్ ఉమన్ వారియర్ తరహా పాత్రలో దీపిక కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం ప్రభాస్ చిత్రానికి నో చెప్పిన ఈమె.. ఇప్పుడు బన్నీ సినిమాకు ఓకే చెప్పింది. ఈ మధ్యలో ఏం జరిగింది? సోషల్ మీడియాలో అసలేం వినిపిస్తోంది.

‘యానిమల్’ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కాగా హీరోయిన్ పాత్ర కోసం దీపికని సంప్రదించాడు. దాదాపు ఓకే అనుకున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే దీపిక పీఆర్ టీమ్.. ఈ విషయాన్ని పలు వెబ్‌సైట్లకు లీక్ చేసింది. దీపిక పాత్ర ఆహా ఓహో అనే రేంజులో ఉండబోతుందని హైప్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత దీపిక తన కండీషన్స్ గురించి సందీప్‌తో చెప్పిందని వార్తలొచ్చాయి. రోజుకి 8 గంటల మాత్రమే పనిచేస్తానని, రూ.40 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కావాలని దీపిక డిమాండ్ చేసినట్లు టాక్ వినిపించింది.

అల్లు అర్జున్ సినిమాలో దీపిక ఎంట్రీ

అలా దీపిక పెట్టిన కండీషన్స్‌తో పాటు ఆమె పీఆర్ టీమ్ చేసే హడావుడి వల్ల సందీప్‌కి చిరాకొచ్చింది. దీంతో దీపికకు నో చెప్పేశాడు. ఇది జరిగిన వెంటనే బాలీవుడ్‌లో ‘స్పిరిట్’ గురించి నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. స్టోరీని కూడా లీక్ చేశారు. ఇదో ‘ఏ’ రేటెడ్ సినిమా అని, హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్ గట్టిగానే ఉందని పలు సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో సందీప్ రెడ్డి వంగాకు మండింది. వెంటనే తృప్తి దిమ్రిని హీరోయిన్‌గా ప్రకటించాడు. దీపిక పేరు ప్రస్తావించకుండా పెద్ద ట్వీట్ పెట్టాడు. ఆమెకు ఇచ్చిపడేశాడు. ఏం చేసుకుంటావో చేస్కో అని అనేశాడు.

దీపిక కండిషన్స్‌కు అట్లీ సమ్మతమా?

ఇది జరిగి కొన్నిరోజుల కూడా కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో దీపికని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీనిపై కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. లెక్క ప్రకారం మృణాల్ ఠాకుర్‌ని హీరోయిన్‌గా తొలుత అనౌన్స్ చేయాలనుకున్నారట. కానీ దీపిక నుంచి ఒత్తిడి రావడంతో ఈమెని హీరోయిన్‌గా అనౌన్స్ చేశారని వినిపిస్తోంది. మరి దీపిక చెప్పిన కండీషన్స్‌కి దర్శకుడు అట్లీ ఒప్పేసుకున్నట్లే కనిపిస్తుంది. ఈ సినిమాలో బన్నీ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రతి పాత్రకు ఓ హీరోయిన్ ఉంటుంది. దీపిక కాకుండా మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్‌ని హీరోయిన్లుగా తీసుకోవాలని ఫిక్సయ్యారట.

చివరగా, దీపిక పదుకొణె కండిషన్స్‌కు అల్లు అర్జున్ మరియు అట్లీ ఒప్పుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.