
📌 Key Points
- దీపిక తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
- ‘వైట్ లోటస్’ ఆడిషన్ తిరస్కరించడంపై అనవసర డ్రామాకు దూరంగా ఉంటానని తెలిపింది.
- అల్లు అర్జున్, అట్లీ సినిమాలో దీపిక నటిస్తున్నట్లు సమాచారం.
- విమర్శలకు స్పందించే శక్తిని వృధా చేసుకోనని దీపిక స్పష్టం చేసింది.
దీపికా పదుకొనే తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను అనవసరమైన విషయాలకు స్పందించనని, తన పని తాను చేసుకుంటానని దీపిక తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నారు.
దీపిక ట్రోల్స్‌పై స్పందన
Deepika Padukone: దీపికా పదుకొనే ఇటీవల కాలంలో సినిమాల కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే కల్కి సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన దీపిక ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. అయితే పలు కారణాల వల్ల ఈమె పాన్ ఇండియా ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే.
సినిమా షూటింగ్ విషయంలో కండిషన్లను పెట్టడం వేళలు, రెమ్యూనరేషన్ వంటి వాటి కారణంగా దీపిక పలు కీలక ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కల్కి సీక్వెల్ నుంచి కూడా ఈమెను తప్పించారు. ఇలా బడా ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న దీపిక ఇటీవల హాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డు అందుకున్న ది వైట్ లోటస్(The White Lotus) సిరీస్ లో ఛాన్స్ వచ్చినా కూడా తప్పుకున్నారు.
సినిమాల నుండి తప్పుకోవడానికి కారణాలు
ఇలా క్రేజీ ప్రాజెక్టుల నుంచి ఈమె తప్పుకోవడంతో తన వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేశారు. ఇలా తన గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విమర్శలపై దీపిక ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ఇది వైట్ లోటస్ ఆడిషన్ ను తిరస్కరించారని వార్తలు రావడంతో ఈమె స్పందిస్తూ.. అనవసరమైన డ్రామాకు దూరంగా ఉండటమే తన బలమని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన గురించి వచ్చే విమర్శలపై , అలాగే ప్రతి చిన్న విషయానికి స్పందించి శక్తిని వృధా చేసుకోనని ఎవరికి ఏమి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు.
అల్లు అర్జున్ అట్లీ సినిమా…
అల్లు అర్జున్ సినిమా విశేషాలు
దీపిక ఇలా ట్రోల్స్ పట్ల స్పందిస్తూ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీపికా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు రాబోతున్న సినిమాలో ఈమె నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు మరిన్ని బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
దీపిక తన వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. అల్లు అర్జున్ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


