
దీపికా పదుకొణె అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇన్నాళ్లు తన కూతురి ముఖాన్ని చూపించకుండా జాగ్రత్త పడిన ఆమె, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో దువా ఫేస్ రివీల్ చేసింది. ఈ దీపావళి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, పాప ముద్దు ముద్దుగా ఉందని అంతా మురిసిపోతున్నారు.
Key Points
దీపికా పదుకొణె ఏడాది తర్వాత తన కూతురు దువా ఫేస్ రివీల్ చేసింది.
దీపావళి సందర్భంగా కుటుంబ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
దువా ముద్దులొలికే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్ వంటి సెలబ్రిటీలు పాపను చూసి క్యూట్ అన్నారు.
దువా ఫేస్ రివీల్: అభిమానులకు సర్‌ప్రైజ్
దీపికా పదుకొణె(Deepika Padukone) గత కొద్ది రోజులుగా వివాదాలు, విమర్శలతో సతమత మవుతోంది. ఇండస్ట్రీలో హీరోయిన్లకు అన్యాయం జరగకుండా పని గంటల విషయంలో ఒంటరి పోరాటం చేస్తోంది. 8 గంటలు మాత్రమే పని చేస్తానంటూ దర్శకనిర్మాతలకే కండీషన్లు పెడుతుండటం గమనార్హం. దీంతో ఇటీవల దీపికాను భారీ ప్రాజెక్ట్స్ నుంచి తొలగించారు. అయినప్పటికీ తన చేతిలో ఉన్న సినిమాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వివాదాస్పద పోస్టులతో నెట్టింట ప్రభంజనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, దీపికా పదుకొణె అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఇన్నాళ్లు తన కూతురి ముఖాన్ని చూపించకుండా.. జాగ్రత్త పడిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది. దీపికా, రణ్‌వీర్‌ల గారాలపట్టి దువాను పరిచయం చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటోలను షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో రణ్‌వీర్ సింగ్ వైట్ కలర్ డ్రెస్ ధరించగా.. తల్లి కూతురు మాత్రం మెరున్ కలర్ డ్రెస్సులతో మెరిసిపోతున్నారు. దువా పిలకలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఆ పాప బోసి నవ్వులు చూసి దీపికా, రణ్‌వీర్(Ranveer Singh) మురిసిపోతున్నారు. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సినీ సెలబ్రిటీలు హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ సైతం క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్, సో క్యూట్ అని కామెంట్లు చేశారు.
వైరల్ అవుతున్న దువా ఫోటోలు
దువా(Dua Singh) పుట్టిన ఏడాది తర్వాత ఆమె ఫేస్ రివీల్ చేయడంతో.. అంతా ఆ పాప గురించే చర్చించుకుంటున్నారు. దీపికా కాపీ క్యాట్.. పార్లే జీ బిస్కెట్ల బిజినెస్‌కి కొత్త పాప దొరికిందంటూ పలు రకాలుగా స్పందించడంతో పాటు దువా ఫోటోలు వైరల్ చేసేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 8న పుట్టిన దువాను కనీసం బయటకు కూడా తీసుకురాకుండా.. ఈ స్టార్ కపుల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత కూతురిని పరిచయం చేయడంతో.. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
దీపికా, రణ్‌వీర్ సంతోషం
A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)
మొత్తంగా, దీపికా పదుకొణె తన కూతురు దువాను పరిచయం చేయడం అభిమానులకు పండుగలా మారింది. ఏడాది తర్వాత బయటపడ్డ దువా ముఖం చూసి నెటిజన్లు, సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు మరిన్ని రోజులు ట్రెండింగ్‌లో ఉండటం ఖాయం.


