
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె 8 గంటల పని విధానంపై డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది. రెండు భారీ ప్రాజెక్ట్‌ల నుంచి ఆమె తొలగింపు దీనికి కారణం. తాజాగా, షాలిని పాండే దీపికాకు మద్దతుగా నిలిచి, నటీనటుల మానసిక ఆరోగ్యం, బ్రేక్‌ల ఆవశ్యకతను నొక్కి చెప్పింది.
Key Points
దీపికా పదుకొణె రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేసే విధానాన్ని డిమాండ్ చేస్తోంది.
ఆమె డిమాండ్ కారణంగా 'స్పిరిట్', 'కల్కి-2' వంటి ప్రాజెక్ట్‌ల నుండి తొలగించబడింది.
యంగ్ బ్యూటీ షాలిని పాండే, దీపికా డిమాండ్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది.
నటీనటులకు కూడా విశ్రాంతి, మానసిక ఆరోగ్యం ముఖ్యమని షాలిని పాండే నొక్కి చెప్పింది.
దీపికా 8 గంటల పని డిమాండ్ వెనుక అసలు కారణం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) ఎనిమిది గంటలు పనిచేసే విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేస్తోంది. ఈక్రమంలోనే.. ఈ అమ్మడు రెండు భారీ ప్రాజెక్ట్‌ల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాతో పాటు, కల్కి-2 నుంచి దీపికాను తీసేసి మరో హీరోయిన్లను పెట్టుకున్నారు. అందుకు కారణం ఆమె రోజులో కేవలం 8గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడంతో వివాదం మొదలైనట్లు టాక్.
ప్రాజెక్ట్‌ల నుండి తొలగింపు – వివాదం ఏమిటి?
గత కొద్ది కాలంగా ఆమె సైలెంట్‌గా పోరాటం చేస్తున్నట్లు ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాకుండా కొంతమంది స్టార్ హీరోలు వారంలో 6 రోజుల పాటు, రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తారని వారి పేర్లను రివీల్ చేయాలనుకోవడం లేదని చెప్పింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ బ్యూటీ షాలిని పాండే, దీపికాకు సపోర్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘దీపికాను తొలగించిన ప్రాజెక్ట్‌లలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఆమె అంటే నాకు చాలా ఇష్టం.
దీపికకు మద్దతుగా షాలిని పాండే ఆసక్తికర వ్యాఖ్యలు
స్కూల్‌లో చదువుకునేటప్పటి నుంచి ఆమెను చూస్తున్నాను. తనొక గొప్ప యాక్టర్ దీపికాకు ఏది అవసరమో అది నిర్భయంగా మాట్లాడుతుంది. తన వల్లే మేమంతా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడగలుగుతున్నాం. మేమూ మనుషులమే.. మాకూడా చిన్నపాటి బ్రేక్ కావాలి. దీపికా డిమాండ్ చేస్తున్నది ఆమెకు దక్కాలి. అందులో తప్పేముంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మొత్తంగా, దీపికా పదుకొణె పని గంటలపై చేసిన డిమాండ్, షాలిని పాండే మద్దతుతో సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. సెలబ్రిటీల మానసిక ఆరోగ్యం, పని విధానాలపై ఈ వివాదం మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.


