
📌 Key Points
- దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావలసి ఉంది.
- తండ్రి మరణం కారణంగా సుకుమార్ సినిమా ఆగిపోయింది.
- వేణు వెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు.
- సంక్రాంతికి ‘ఎల్లమ్మ’ సినిమా గ్లింప్స్ విడుదలైంది.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు. అయితే, గతంలో సుకుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా సినిమా ఆగిపోయిందని తెలిపారు. ప్రస్తుతం వేణు వెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ సినిమాలో నటిస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ మూవీ ఆగిపోవడానికి కారణం?
Devi Sri Prasad: రాక్ స్టార్ దేవిశ్రీపసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. సంగీత దర్శకుడిగా తన మ్యూజిక్ తోనే మ్యాజిక్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సంగీత దర్శకుడిగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న దేవిశ్రీప్రసాద్ త్వరలోనే వెండితెరపై హీరోగా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈయన వేణు వెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాలో హీరోగా నటించబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల దేవిశ్రీప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాను ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాను కానీ నిజానికి సుకుమార్ డైరెక్షన్లోనే తాను హీరోగా ఓ సినిమాలో చేయాల్సి ఉండేదని తెలిపారు. సుకుమార్ గారు ఒక కథ తనకు చెప్పారని ఆ కథ అద్భుతంగా నచ్చిందని ఈ ప్రాజెక్టుకు తాను ఓకే చెప్పానని తెలిపారు.
హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ
ఇలా ఈ ప్రాజెక్టు అనుకున్న సమయంలోనే మా తండ్రిగారు చనిపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని లేకపోతే తాను సుక్కు గారి డైరెక్షన్లోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యేవాన్ని అంటూ దేవి శ్రీ ప్రసాద్ తెలియజేశారు. కేవలం సుకుమార్ గారు మాత్రమే కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హరీష్ శంకర్ అలాగే దిల్ రాజు వంటి వారు తనని నటన విషయంలో ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారని దేవి శ్రీ ప్రసాద్ తెలియజేశారు. మరి వీరి కాంబినేషన్లో రావాల్సిన సినిమాని పూర్తిగా పక్కన పెట్టారా లేదంటే మరి ఇతర హీరోతోనైనా చేశారా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఇలా ఈ సినిమా మిస్ కావడంతో దేవిశ్రీప్రసాద్ పలు సినిమాలకు సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈయనకు చివరికి ఎల్లమ్మ (Yellamma)సినిమాలో నటించే అవకాశం లభించింది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది .సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ పస్ట్ లు కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. బలగం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను 2026 దసరా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఎల్లమ్మ సినిమా విశేషాలు
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించిన ‘ఎల్లమ్మ’ సినిమా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఆయన హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. సంక్రాంతికి విడుదలైన గ్లింప్స్ కు మంచి స్పందన లభిస్తోంది.


