|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిత్రనిర్మాతలకు మానవ భావోద్వేగమే అతిపెద్ద గొప్పతనం.. ధనుష్ ఎమోషనల్ కామెంట్స్

Published: 26-06-2025, 2:20 AM
చిత్రనిర్మాతలకు మానవ భావోద్వేగమే అతిపెద్ద గొప్పతనం.. ధనుష్ ఎమోషనల్ కామెంట్స్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ధనుష్ నటన ప్రశంసలు అందుకుంది. తాజాగా ధనుష్ చేసిన కొన్ని ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Key Points

1

ధనుష్ 'కుబేర' సినిమాలోని పాత్ర ప్రేక్షకులను కదిలించింది.

2

ధనుష్ యాక్షన్ సన్నివేశాలకు మించి మానవ భావోద్వేగాల ప్రాముఖ్యతను తెలిపారు.

4

ధనుష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కుబేర సినిమా హిట్ టాక్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఏకకాలంలో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, జిమ్ సర్బ్, రష్మిక మందన్న, దలీప్ తహిల్ తదితరులు నటించారు.

ధనుష్ యొక్క ఎమోషనల్ కామెంట్స్

ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ వ్యవహరించారు. ఈ మూవీలో దనుష్ పాత్ర ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నటుడు ధనుష్ చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువస్తాయని చెప్పుకొచ్చాడు. కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రనిర్మాతలకు మానవ భావోద్వేగమే అతిపెద్ద గొప్పతనం అని ఆశను ఇచ్చారు’ అని చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ధనుష్ కి ఇది నిజంగా మంచి మసాజ్, ఇండియాలో అత్యుత్తమ నటుడు అని కొనియాడుతున్నారు. మరికొంతమంది.. నిజం చెప్పారు సార్ యాక్షన్ కట్టులు కాటార్లు గ్రాఫిక్స్ అయితే తప్పా రావట్లే జనాలు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ధనుష్ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో భావోద్వేగాల ప్రాముఖ్యతను ఎత్తి చూపాయి. కుబేర సినిమా విజయం ఈ విషయాన్ని మరింత బలపరుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.