|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ధనుష్, మృణాల్ పెళ్లి వెనుక అసలు నిజం! వైరల్ వీడియో కలకలం!

Published: 24-01-2026, 3:35 AM
షాకింగ్: ధనుష్, మృణాల్ పెళ్లి వెనుక అసలు నిజం! వైరల్ వీడియో కలకలం!
  • ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
  • వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నట్లు వదంతులు.
  • ఆ వీడియో ఒక AI క్రియేటెడ్ వీడియో అని తేలింది.
  • ధనుష్ గతంలో తన భార్యకు విడాకులు ఇచ్చారు.

ధనుష్, మృణాల్ ఠాకూర్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ వీడియోలో నిజం ఎంత? వారి పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ధనుష్, మృణాల్ పెళ్లి వార్తల్లో నిజమెంత?

Dhanush – Mrunal Thakur : తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఫిబ్రవరి 13న వీరిద్దరి పెళ్లి జరగబోతుంది అంటూ నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పిన కూడా రూమర్స్ ఆగడం లేదు. తాజాగా వీళ్ళిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పెళ్లికి తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా హాజరైనట్లు ఓ వీడియో బయటకు వచ్చింది.. నిజంగానే వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. వీడియో నిజమే కానీ.. అందులో నిజం లేదు.. ఈ కన్ఫ్యూజన్ ఏంటి అనే ఆలోచన వస్తుంది కదూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో యొక్క అసలు రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హీరో ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే అప్పటినుండి ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ధనుష్ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో ఉన్నట్లు ఓ వార్త కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది.. ఇందులో నిజం లేదని టీం క్లారిటీ ఇచ్చిన సరే వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ వార్తలకు ఇంకాస్త ఊపునిచ్చేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ధనుష్, మృణాల్ పెళ్లి వీడియో.. మీరు విన్నది నిజమే అయితే ఇది నిజం పెళ్లి కాదు.. ఇదొక ఏఐ వీడియో.. ఆ వీడియోని ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో పెళ్లి బట్టల్లో ధనుష్ – మృణాల్ కనిపిస్తున్నారు. వీళ్ళ పెళ్లికి హీరోయిన్ త్రిష, శృతిహాసన్, హీరో విజయ్ దళపతి, అలాగే అజిత్ కూడా హాజరైనట్లు కనిపిస్తుంది.. ఇది చూసిన నెటిజన్లు జంట బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై ధనుష్, మృణాల్ ఠాకూర్ స్పందిస్తారేమో చూడాలి..

వైరల్ వీడియో వెనుక అసలు రహస్యం

హీరో ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. గత ఏడాది నటించిన కుబేర చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఒకవైపు తెలుగులోనూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు ధనుష్. తమిళ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు.. ఇక ఇటీవల బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అటు మృణాల్ ఠాకూర్ కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.. ఓ రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..

నెట్టింట వైరల్ అవుతున్న ఏఐ వీడియో

?igsh=MXdmaXY2aWRlYTBveg==

ధనుష్, మృణాల్‌ల పెళ్లి వీడియో ఒక ఏఐ సృష్టించినది అని తేలింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.